![]() |
![]() |

మన భారతీయులందరికి తీరిక కుదిరినా కుదరకపోయినా చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని ఆటోమెటిక్ గా గూగుల్ చర్చ్ లోకి వెళ్లి తాము ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకోవడం అలవాటు. కానీ మనం సెర్చ్ చేసే వ్యక్తులు మామూలు సెలబ్రిటీస్ అయి ఉండరు. ఆ సెలబ్రిటీస్ లో సినిమా,క్రికెట్,వ్యాపార రంగానికి చెందిన ఎంతో మంది సెలబ్రిటీస్ ఉంటారు. పైగా వాళ్లకి గూగుల్ సెర్చ్ లో ఇండియాలోనే నెంబర్ వన్ గా నిలవడం అంటే ఎంతో గొప్ప అని చెప్పవచ్చు. ఇప్పుడు ఒక హీరోయిన్ నెంబర్ వన్ గా నిలిచి చరిత్ర సృష్టించింది.
ఎక్కువ మంది భారతీయలు గూగుల్ లో సెర్చ్ చేసిన వ్యక్తుల జాబితాని గూగుల్ యాజమాన్యం ప్రతి ఏడాది ప్రకటిస్తున్నట్టే ఈ ఏడాది కూడా ప్రకటించింది. ఇప్పుడు ఎక్కువ మంది భారతీయులు సెర్చ్ చేసిన జాబితాలో ప్రముఖ నటి కియారా అద్వానీ వచ్చి చేరింది. గూగుల్ ప్రకటించిన ఈ వార్తతో కియారా ఫుల్ ఆనందంలో ఉంది. బాలీవుడ్ కి చెందిన ఎంతో మంది సెలబ్రిటీస్ ని సైతం వెనక్కి నెట్టి కియారా నెంబర్ వన్ గా నిలిచింది. అలాగే కియారా కి భారతీయ ప్రేక్షకుల్లో పెరుగుతున్న ఆధారణని కూడా రుజువు చేస్తుందని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
తెలుగులో రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం లో వచ్చిన వినయ విధేయ రామ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన కియారా అద్వానీ బాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాల్లో నటించింది.ఇటీవలే ప్రముఖ నటుడు సిద్దార్ధ మల్హోత్రా ని వివాహం చేసుకున్న కియారా తాజాగా శంకర్ దర్శత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ లో చేస్తుంది.
![]() |
![]() |