![]() |
![]() |

బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ 'పింక్' తెలుగులో 'వకీల్ సాబ్' టైటిల్‌తో రీమేక్ అవుతోంది. పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తోన్న ఈ చిత్రానికి 'మిడిల్ క్లాస్ అబ్బాయి' ఫేమ్ శ్రీరామ్ వేణు దర్శకుడు. కొద్ది రోజులుగా ఈ సినిమాలో శ్రుతి హాసన్ నటించనుందంటూ సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. లాయర్‌గా నటిస్తోన్న పవర్ స్టార్‌కు భార్యగా ఆమె కనిపించనున్నదనేది ఆ ప్రచార సారాంశం. ఇదివరకు పవన్ కల్యాణ్‌తో 'గబ్బర్ సింగ్', 'కాటమరాయుడు' చిత్రాల్లో కలిసి నటించింది శ్రుతి. ఆ ఇద్దరి జంట తెరపై బాగుందనే పేరు వచ్చింది.
అయితే తాను 'వకీల్ సాబ్'లో నటిస్తున్నాననేది వాస్తవం కాదని శ్రుతి ఖండించింది. ఆ సినిమాలో ఒక పాత్ర కోసం తనను చాలా రోజుల క్రితం సంప్రదించారని అంగీకరిస్తూనే, ఆ చర్చలు ఫలించలేదని తెలిపింది. అందువల్ల ఆ సినిమాలో తాను చేస్తున్నాననే ప్రచారం కేవలం వదంతిగా ఆమె తేల్చేసింది. పైగా, దాని గురించి మాట్లాడాలని అనుకోవట్లేదని కూడా చెప్పింది శ్రుతి. ప్రస్తుతం ముంబైలో ఉన్న ఆమె, లాక్‌డౌన్ రోజుల్ని తన పెట్‌తో గడుపుతోంది.
శ్రుతి చివరగా తెలుగులో నటించిన సినిమా 'కాటమరాయుడు'. దాని తర్వాత అనూహ్యంగా ఆమె డిమాండ్ పడిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు రవితేజ 'క్రాక్' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదివరకు ఇదే జోడీతో 'బలుపు' మూవీ రూపొందించిన గోపీచంద్ మలినేని ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.
![]() |
![]() |