![]() |
![]() |

`బాహుబలి` సిరీస్ తో టాలీవుడ్ లో `పాన్ - ఇండియా ప్రాజెక్ట్స్` ట్రెండ్ ఊపందుకుంది. `బాహుబలి` సిరీస్ తరువాత తన ప్రతీ చిత్రాన్ని ప్రభాస్ పాన్ - ఇండియా మూవీగానే ప్లాన్ చేస్తుంటే.. `సైరా.. నరసింహారెడ్డి`తో మెగాస్టార్ చిరంజీవి, `ఆర్ ఆర్ ఆర్`తో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ - మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, `హరిహర వీరమల్లు`తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, `పుష్ప`తో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా అదే బాట పట్టారు.
ఈ నేపథ్యంలో.. సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎప్పుడెప్పుడు పాన్ - ఇండియా వెంచర్ చేస్తారా? అని ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు తగ్గట్టే.. ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. తన ఫేవరేట్ డైరెక్టర్స్ లో ఒకరైన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో మహేశ్ చేయబోతున్న సినిమా.. పాన్ - ఇండియా ప్రాజెక్టుగానే రాబోతోందట. అంతేకాదు.. మహేశ్ ఇమేజ్, క్రేజ్ కి తగ్గట్టే తన పాత్రని త్రివిక్రమ్ డిజైన్ చేశారని బజ్. మొత్తమ్మీద.. మహేశ్ అభిమానుల పాన్ - ఇండియా డ్రీమ్ నెరవేరబోతున్నట్లే అన్నమాట. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
![]() |
![]() |