![]() |
![]() |

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తన పెళ్లిని వాయిదా వేసుకున్నానని హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా తెలిపింది. 'కృష్ణగాడి వీరప్రేమగాథ'తో వెండితెరకు పరిచయమైన మెహ్రీన్.. మహానుభావుడు, రాజా ది గ్రేట్, F2 వంటి సినిమాలతో ఆకట్టుకుంది. ఒకవైపు నటిగా అలరిస్తూనే.. మరోవైపు పెళ్లికి రెడీ అయింది. హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్ తో మార్చిలో నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ ఏడాదిలోనే పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచించడం లేదని మెహ్రీన్ చెబుతోంది. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న మెహ్రీన్.. కోవిడ్, పెళ్లి తదితర విషయాల గురించి మీడియాతో మాట్లాడింది.
"కరోనా మహమ్మారి మనకు కావాల్సిన వ్యక్తులను ఎందరినో పొట్టనపెట్టుకుంటోంది. ఇది చాలా విషాదకరం. గతేడాది మా నాన్న కరోనా బారిన పడ్డారు. ఈ ఏడాది మా అమ్మకు, నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. కొద్ది రోజుల వరకు ఎంతో ఆందోళన చెందాం. కానీ దాన్నుంచి ఎలాగోలా బయటపడ్డాం. అయితే ఇప్పటికీ నీరసంగా ఉంటోంది. అందుకే వ్యాయామాలు చేస్తున్నాను. నాకు కరోనా సోకిన సమయంలో భవ్య డైలీ కాల్ చేసి నా యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవాడు. అలాగే, అతడికి పాజిటివ్ వచ్చినప్పుడు అతడి ఆరోగ్యం మీద నేను శ్రద్ధ చూపించాను. ఇక పెళ్లి గురించి ఇప్పుడే ఆలోచించడం లేదు. పరిస్థితులు చక్కబడాలి కదా.." అని మెహ్రీన్ చెప్పుకొచ్చింది.
![]() |
![]() |