![]() |
![]() |

రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కు సంబరాన్ని కలిగిస్తూ 'ఆర్ఆర్ఆర్' మూవీ టీమ్ సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. మార్చి 27 చరణ్ బర్త్‌డే. ఈ సందర్భంగా ఒక రోజు ముందుగానే రోమాలు నిక్కబొడుచుకొనే రీతిలో ఆయన లుక్‌ను ప్రెజెంట్ చేసింది. మనందరికీ అల్లూరి సీతారామరాజు అనగానే కాషాయ ధోతీ ధరించి, చేతిలో విల్లమ్ములు పట్టుకొని ఉండే రూపం గుర్తుకు వస్తుంది. అదే తరహాలో ఇప్పుడు రామరాజుగా చరణ్‌ను ప్రెజెంట్ చేశారు. ఈ పోస్టర్‌లో రామరాజు గెటప్‌లో విల్లును పైకి ఎక్కుపెట్టి బాణాన్ని విసురుతున్నట్లు కనిపిస్తున్నాడు చరణ్.
ఈ పోస్టర్‌ను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన చరణ్, "ధైర్యం, గౌరవం, సమగ్రత. వీటిని నిర్వచించిన వ్యక్తి! అల్లూరి సీతారామరాజు పాత్రను పోషించడం నా అదృష్టం." అని ట్వీట్ చేశాడు. ఆయన దీన్ని పోస్ట్ చేయడం ఆలస్యం.. నిమిషాల వ్యవధిలోనే వేల సంఖ్యలో రిట్వీట్స్, లైక్స్ సాధించి వైలర్ అయ్యింది.
చరణ్ స్నేహితుడు, 'ఆర్ఆర్ఆర్'లో కొమరం భీమ్ పాత్రధారి జూనియర్ ఎన్టీఆర్ సైతం ఇదే పోస్టర్‌ను తన ట్విట్టర్ పేజ్ ద్వారా షేర్ చేసి, "అతను ధైర్యవంతుడు. అతను నిజాయితీపరుడు. అతను నీతిమంతుడు. అల్లూరి సీతారామరాజుగా ఉగ్ర అవతారంలో ఇక్కడ నా సోదరుడు రామ్‌చరణ్." అంటూ రాసుకొచ్చాడు.
ఇక ఈ మూవీలో చరణ్ జోడీగా సీత పాత్ర చేస్తోన్న అలియా భట్, "సీతకు చెందిన భీకరమైన, శక్తివంతమైన, ధైర్యవంతుడైన
రామరాజు" అని రాసి, చరణ్ పోస్టర్‌ను షేర్ చేసింది.
యస్.యస్. రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న 'ఆర్ఆర్ఆర్'లో రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవ్‌గణ్, శ్రియ, సముద్రకని కీలక పాత్రధారులు. అక్టోబర్ 13న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత డీవీవీ దానయ్య సన్నాహాలు చేస్తున్నారు.

![]() |
![]() |