Home

»

Latest News

వైష్ణ‌వ్ తో మ‌రోసారి డీఎస్పీ!

Sep 6, 2021 3:20PM

బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `ఉప్పెన‌`తో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయాడు వైష్ణ‌వ్ తేజ్. త్వ‌ర‌లోనే ఈ మెగా కాంపౌండ్ యంగ్ హీరో న‌టించిన రెండో సినిమా థియేట‌ర్స్ లోకి రాబోతోంది. స‌న్న‌పురెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి ప్ర‌సిద్ధ న‌వ‌ల `కొండ పొలం` ఆధారంగా రూపొందిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి వెర్స‌టైల్ కెప్టెన్ క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. స్వ‌ర‌వాణి కీర‌వాణి బాణీలు అందించారు. ర‌కుల్ ప్రీత్ సింగ్ నాయిక‌గా న‌టించిన ఈ అడ్వెంచ‌ర‌స్ మూవీ.. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 8న రిలీజ్ కానుంది.

ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం ప్ర‌ముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మిస్తున్న పేరు నిర్ణ‌యించ‌ని సినిమాలో న‌టిస్తున్నాడు వైష్ణ‌వ్. త‌న మూడో చిత్రంగా రూపొందుతున్న ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ కి `అర్జున్ రెడ్డి` త‌మిళ వెర్ష‌న్ `ఆదిత్య వ‌ర్మ‌` డైరెక్ట‌ర్ గిరీశ‌య్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. `రొమాంటిక్` ఫేమ్ కేతికా శ‌ర్మ నాయిక‌గా న‌టిస్తోంది. కాగా, తాజాగా ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంపిక‌య్యారు. మ‌రి.. వైష్ణ‌వ్ తొలి చిత్రం `ఉప్పెన‌` ఘ‌న‌విజ‌యంలో ముఖ్య భూమిక పోషించిన‌ డీఎస్పీ.. `వైష్ణ‌వ్ తేజ్ 3`కి కూడా ఆ మ్యాజిక్ ని రిపీట్ చేస్తారేమో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com