![]() |
![]() |

దొంగచాటుగా తొంగిచూడడాన్ని 'పీప్ షో' అంటారన్న విషయం తెలిసిందే. ఇప్పుడదే టైటిల్ తో తెలుగులో ఓ సినిమా రాబోతోంది. ఇందులో జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్ హీరోగా నటిస్తున్నాడు. తాజాగా విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది.
సుప్రీమ్ డ్రీమ్స్ పతాకంపై క్రాంతికుమార్ సి.హెచ్ దర్శకత్వంలో ఎస్.ఆర్.కుమార్ నిర్మిస్తున్న వినూత్న కథాచిత్రం 'పీప్ షో'. రాంప్రసాద్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నేహాదేశ్ పాండే హీరోయిన్. ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ సంస్థ కార్యాలయంలో విడుదల చేశారు. జబర్దస్త్ సెలబ్రిటీస్ హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. "రాంప్రసాద్ హీరోగా లాంచ్ అవుతున్న 'పీప్ షో' కాన్సెప్ట్ తమకు తెలుసని, ఈ కాన్సెప్ట్ తో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారని, అందరికీ విపరీతంగా నచ్చుతుందని" అతిధులుగా హాజరైన హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను అన్నారు.
సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను 'పీప్ షో' ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం పట్ల హీరో ఆటో రాంప్రసాద్, దర్శకుడు క్రాంతి కుమార్, నిర్మాత ఎస్.ఆర్.కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. 'పీప్ షో' తమ బ్యానర్ 'సుప్రీమ్ డ్రీమ్స్'కు మంచి శుభారంభం ఇస్తుందని నిర్మాత అన్నారు.

తాజాగా విడుదలైన 'పీప్ షో' ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ పోస్టర్ లో హీరోయిన్ నేహా దేశ్ పాండే నగ్నంగా ఉండి రామ్ ప్రసాద్ ఫొటోను తన అందాలకు అడ్డుగా పెట్టుకొని కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
![]() |
![]() |