![]() |
![]() |

విలక్షణ నటునిగా కోట శ్రీనివాసరావుకు ఉన్న పేరు ప్రఖ్యాతులు ఎలాంటివో మనకు తెలుసు. కైకాల సత్యనారాయణ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా అన్ని రకాల పాత్రలూ పోషించి శెభాష్ అనిపించుకున్నారు. ప్రస్తుతం వృద్ధాప్య సమస్యలు ఎదుర్కొంటూ అప్పుడప్పుడూ మాత్రమే సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తున్నారు. అయినప్పటికీ అప్పుడప్పుడూ ఇంటర్వ్యూలు ఇస్తూ, తన మనసులోని భావాలను నిస్సంకోచంగా చెప్తూ వార్తల్లో వ్యక్తిగా మారుతున్నారు. అలా లేటెస్ట్‌గా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
యువహీరోల్లో జూనియర్ ఎన్టీఆర్‌ను ఆకాశానికెత్తేసిన కోట, తారక్‌కు ఉన్న పొటెన్షియాలిటీ ఇంకే హీరోకూ లేదని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మహేశ్‌బాబు పేరు సైతం మర్చిపోయి సురేశ్‌బాబు అని చెప్పడం గమనార్హం. కాగా చివరలో తారక్‌ను సీనియర్ యాక్టర్ చంద్రమోహన్‌తో పోల్చడం కొసమెరుపు అనుకోవాలి.
"నాకు బాగా నచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్. ఓపెన్‌గా చెప్తున్నాను. అతనికున్న పొటెన్షియాలిటీ ఎవరికీ లేదు. మంచి నటులున్నారు. బన్నీ, కృష్ణగారబ్బాయి.. మహేశ్‌బాబు.. ఇంకా ఉన్నారు కానీ అతని (తారక్)కి ఉన్న పొటెన్షియాలిటీ లేదు. ఫ్రాంక్‌గా చెప్తున్నా. వీళ్లూ మంచి నటులే. కాదని నేననను. పొటెన్షియాలిటీ విషయానికి వస్తే అతనే. వాక్శుద్ధి ఉంది. డైలాగ్ బ్రహ్మాండంగా ఉంది. మెమరీ ఉంది. డాన్సులు బాగా చేస్తాడు.. అన్నీ ఉన్నాయి. చంద్రమోహన్ గారి లాగా.. పొట్టోడు పొట్టోడు అంటారు. అతని పొట్టితనమే అతన్ని కాపాడింది. అతనికెవరూ కాంపిటిషన్ కాదు, వాడెవరికీ కాంపిటిషన్ కాదు. ఆయన (చంద్రమోహన్) అంటే నాకు చాలా ఇష్టం." అంటూ చెప్పుకొచ్చారు కోట శ్రీనివాసరావు.
![]() |
![]() |