![]() |
![]() |

స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు నుంచి రాబోతున్న తాజా చిత్రం `ఎఫ్ 3`. విక్టరీ వెంకటేశ్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ హిలేరియస్ ఎంటర్టైనర్.. 2019 నాటి సంక్రాంతి విజేత `ఎఫ్ 2` తాలూకు సిరీస్ లో రెండో సినిమాగా అలరించనుంది. వేసవి కానుకగా మే 27న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జనం ముందుకు వస్తోంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. గతంలో మే నెల వేదికగా `దిల్` రాజు బేనర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి వచ్చిన చిత్రాల్లో సింహభాగం విజయపథంలో పయనించాయి. `ఆర్య` (2004), `భద్ర` (2005), `పరుగు` (2008), `సుప్రీమ్` (2016), `మహర్షి` (2019 - సహ నిర్మాణం).. ఇలా రాజు సంస్థలో నిర్మితమైన సినిమాలు మే నెల వేదికగా బాక్సాఫీస్ ముంగిట వసూళ్ళ వర్షం కురిపించాయి. మరి.. ఈ విజయవంతమైన చిత్రాల జాబితాలో `ఎఫ్ 3` కూడా చేరుతుందేమో చూడాలి.
కాగా, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందించిన `ఎఫ్ 3`లో తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహాన్, సునీల్, రాజేంద్ర ప్రసాద్, అలీ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. `బుట్టబొమ్మ` పూజా హెగ్డే ఓ ప్రత్యేక గీతంలో తన చిందులతో కనువిందు చేయనుంది.
![]() |
![]() |