![]() |
![]() |

అటు మెలోడీబ్రహ్మ మణిశర్మ, ఇటు ఆయన తనయుడు మహతి స్వర సాగర్.. ఒకే రోజు బాక్సాఫీస్ బరిలోకి దిగుతుండడం తెలుగునాట ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఆ వివరాల్లోకి వెళితే.. స్టార్ బ్యూటీ సమంత టైటిల్ రోల్ లో నటిస్తున్న పాన్ - ఇండియా ప్రాజెక్ట్ `యశోద`. హరి - హరీశ్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ క్రేజీ వెంచర్.. ఆగస్టు 12న రిలీజ్ కి రెడీ అయింది. ఈ సినిమాకి మణిశర్మ సంగీతమందిస్తున్నారు. కట్ చేస్తే.. అదే రోజున మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ బాణీలందిస్తున్న చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఆ సినిమానే.. `మాచర్ల నియోజక వర్గం`. యూత్ స్టార్ నితిన్ కథానాయకుడిగా ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ఈ పొలిటికల్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. ఇందులో నితిన్ కి జంటగా `ఉప్పెన` భామ కృతి శెట్టి, కేథరిన్ ట్రెసా నటిస్తున్నారు. మరి.. ఒకే రోజున బాక్సాఫీస్ బరిలో దిగుతున్న తండ్రీతనయులు మణిశర్మ, మహతి స్వర సాగర్.. ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.
కొసమెరుపు ఏంటంటే.. `యశోద`తో హరి - హరీశ్ దర్శకులుగా పరిచయమవుతుండగా.. `మాచర్ల నియోజక వర్గం` కూడా కెప్టెన్ గా ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డికి తొలి ప్రయత్నమే.
![]() |
![]() |