![]() |
![]() |

నటరత్న నందమూరి తారక రామారావు పాత చిత్రాల టైటిల్స్ తో పలువురు అగ్ర కథానాయకులు మళ్ళీ సందడి చేశారు. అలా ఎన్టీఆర్ టైటిల్ తో జనం ముందుకు వచ్చిన సినిమాల్లో `అడవి రాముడు` (2004) ఒకటి. 1977 నాటి ఇండస్ట్రీ హిట్ `అడవి రాముడు` టైటిల్ తో వచ్చిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ టైటిల్ రోల్ లో ఎంటర్టైన్ చేశారు. `వర్షం` (2004) వంటి బ్లాక్ బస్టర్ తరువాత ప్రభాస్ నుంచి వచ్చిన ఈ చిత్రం.. ఆశించిన స్థాయిలో ఆడకపోయినా మంచి ఓపెనింగ్స్ ని రాబట్టుకుంది. అగ్ర దర్శకుడు బి. గోపాల్ రూపొందించిన ఈ సినిమాలో ప్రభాస్ కి జంటగా ఆర్తి అగర్వాల్ నటించగా బ్రహ్మానందం, రంగనాథ్, తెలంగాణ శకుంతల, సాయి కుమార్, నాజర్, వేణుమాధవ్, అజయ్ రత్నం, రాజీవ్ కనకాల, రవిబాబు, సీమ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. రమ్యకృష్ణ ఓ ప్రత్యేక గీతంలో కనువిందు చేశారు. రాజేంద్ర కుమార్ కథను అందించిన ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ సంభాషణలు సమకూర్చారు.
మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందించిన ఈ సినిమాలో.. ``ఆరేసుకోబోయి`` (రీమిక్స్), ``జింక వేటకు``, ``నగరంలో``, ``గోవింద గోవిందా``, ``ఆకాశం సాక్షిగా``, ``అడుగేస్తేనే`` అంటూ మొదలయ్యే పాటలన్నీ ఆకట్టుకున్నాయి. ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై చంటి అడ్డాల నిర్మించిన `అడవి రాముడు`.. 2004 మే 21న విడుదలైంది. నేటితో ఈ చిత్రం 18 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |