![]() |
.webp)
'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' మూవీలో నాగరాజుగా అలరించి, ఆ తర్వాత పలు సినిమాల్లో తన నటనతో ప్రేక్షకుల మనసులకు మరింత దగ్గరైన సుధాకర్ కొమాకుల పండంటి కొడుక్కి తండ్రయ్యాడు. ఆయన భార్య హారిక సందెపోగు ఈ నెల 14న అమెరికాలోని షికాగోలో అబ్బాయిని కన్నది. ప్రసవానంతరం తల్లీకొడుకులిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. బాబుకు 'రుద్ర' అనే పేరు పెట్టుకున్నారు. రుద్ర అంటే శివునికి మరో పేరు అనే విషయం మనకు తెలిసిందే.
ఈరోజు సుధాకర్, హారిక పెళ్లిరోజు. ఈ సందర్భంగా తమకు పుత్రోదయం కలిగిన విషయాన్ని ఫేస్‌బుక్ పేజ్ ద్వారా షేర్ చేసుకున్నాడు సుధాకర్. బాబును పొత్తిళ్లలో పొదివి పట్టుకొని ఉన్న భార్యతో పాటు తీయించుకున్న ఫొటోను షేర్ చేసిన అతను, "అత్యంత ఆనందకర వార్త! మా పెళ్లిరోజుకు వారం ముందు అమెరికాలోని షికాగోలో మే 14న మాకు అబ్బాయి పుట్టాడని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. ఇది మా జీవితకాల ప్రత్యేక సందర్భం! శివుని మరో పేరు అయిన రుద్ర అని బాబుకు పేరు పెట్టుకున్నాం. దానికి చెడును తరిమికొట్టేవాడు, అభినందనీయుడు అని కూడా అర్థాలు ఉన్నాయి. మా రుద్ర కొమాకులకు మీ ఆశీర్వాదాలు కావాలి." అని రాసుకొచ్చాడు సుధాకర్.
.webp)
![]() |