![]() |
![]() |

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా, దర్శకుడు సాయి కిరణ్ దైదా దర్శకత్వంలో కలాహీ మీడియా బ్యానర్ పై తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘లెగసీ’. యశ్వంత్ దగ్గుమాటి, సాయి కిరణ్ రెడ్డి దైదా నిర్మిస్తున్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ‘లెగసీ’ అనౌన్స్‌మెంట్ టీజర్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని కలిగించింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘పిండం’ చిత్రాన్ని నిర్మించిన కలాహీ మీడియా నుంచి వస్తున్న రెండో చిత్రం కావడంతో ‘లెగసీ’పై అంచనాలు మరింత పెరిగాయి.
‘లెగసీ’ ఒక ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ డ్రామా. అధికారం, కుటుంబం, ప్రేమ, ద్రోహం చుట్టూ సాగే ఈ కథలో ఒక వారసుడు తాను కోరుకోని ప్రమాదకరమైన ప్రపంచంలోకి అడుగుపెడతాడు. తన తండ్రి గతానికి సంబంధించిన దాగి ఉన్న నిజాలను ఎదుర్కొంటూ, శక్తివంతమైన ప్రత్యర్థులతో పోరాడుతూ తనపై పడిన వారసత్వపు భారాన్ని మోసే పరిస్థితిని ఎదుర్కొంటాడు.
ఈ చిత్రంలో విశ్వక్ సేన్ ఇప్పటివరకు చూడని విభిన్నమైన, శక్తివంతమైన అవతార్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఏక్తా రాథోడ్ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రముఖ నటుడు కె.కె.మీనన్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.

‘లెగసీ’ షూటింగ్ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. నేటి నుంచి చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, పరిసర ప్రాంతాల్లో నెల రోజుల పాటు కీలక చిత్రీకరణ జరగనుంది. ప్రధాన తారాగణం పాల్గొనే ఈ షెడ్యూల్‌లో కథకు కీలకమైన సన్నివేశాలతో పాటు భారీ యాక్షన్ ఎపిసోడ్స్, పాటలను చిత్రీకరించనున్నారు.
అధికారాన్ని వారసత్వంగా పొందడం మాత్రమే కాదు.. ఆ వారసత్వాన్ని కొనసాగించాలా? లేక తిరగరాయాలా? అనే ప్రశ్న చుట్టూ సాగే ఈ ఆసక్తికరమైన కథ డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే డిసెంబర్ లో ఇప్పటికే పలువురు స్టార్స్ కర్చీఫ్ వేశారు. ప్రభాస్ 'ఫౌజి' డిసెంబర్ 3న విడుదల కానుంది. బాలకృష్ణ 'NBK111'ను డిసెంబర్ 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నాగార్జున 'కింగ్ 100' సైతం డిసెంబర్ లోనే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఈ భారీ సినిమాల నడుమ డిసెంబర్ బాక్సాఫీస్ ఫైట్ కి విశ్వక్ సేన్ రెడీ అవుతుండటం ఆసక్తికరంగా మారింది.
[Vishwak Sen, LEGACY, Balakrishna, NBK111, Prabhas, Fauzi]
![]() |
![]() |