![]() |
![]() |

కోలీవుడ్ లో వరుస విజయాలతో ముందుకు సాగుతున్న దర్శకుడు అట్లీ.. తాజాగా బాలీవుడ్ బాట పట్టిన సంగతి తెలిసిందే. అగ్ర కథానాయకుడు షారుక్ ఖాన్ కాంబినేషన్ లో తన బాలీవుడ్ డెబ్యూ మూవీ చేస్తున్నాడు అట్లీ. అంతేకాదు.. ఇదే సినిమాతో లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా హిందీ చిత్ర సీమలో తొలి అడుగు వేస్తోంది. అలాగే ప్రియమణి, `దంగల్` ఫేమ్ సాన్యా మల్హోత్రా, యోగిబాబు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ పూణే పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో మరో ఇద్దరు సౌత్ స్టార్స్ సందడి చేయనున్నారట. ఆ స్టార్స్ మరెవరో కాదు.. ఇళయ దళపతి విజయ్, రానా దగ్గుబాటి. ఇన్ సైడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. విజయ్ అతిథి పాత్రలో కనిపించనుండగా.. రానా దగ్గుబాటి నెగటివ్ షేడ్స్ ఉన్న ముఖ్య పాత్రలో నటించబోతున్నట్లు తెలిసింది. త్వరలోనే షారుక్ - అట్లీ ఫస్ట్ జాయింట్ వెంచర్ లో విజయ్, రానా ఎంట్రీపై క్లారిటీ రానుంది. మరి.. దక్షిణాది తారల సమ్మేళనంగా రూపొందుతున్న ఈ బాలీవుడ్ మూవీ.. షారుక్ కి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
![]() |
![]() |