![]() |
![]() |

సమంత ఎప్పుడైతే తన సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి అక్కినేని అనే ఇంటిపేరు తొలగించిందో, అప్పట్నుంచీ నాగచైతన్య, సమంత మధ్య కలతలు చేలరేగాయా? వారు విడిపోనున్నారా? అనే ప్రచారం కొనసాగుతూ వస్తోన్న విషయం చూస్తున్నాం. అయితే ఇటు సమంత కానీ, అటు చైతూ కానీ ఈ విషయంలో నోరు విప్పలేదు. పైగా, అప్పట్నుంచీ ఇద్దరూ కలిసి ఎక్కడా కనిపించలేదు. వేర్వేరుగానే కనిపిస్తున్నారు. దాంతో ఇద్దరి మధ్యా దూరం పెరిగిందేమోనని ఆందోళన అక్కినేని అభిమానులను కుదురుగా ఉండనీయట్లేదు. లేటెస్ట్‌గా నాగార్జున కూడా వారి ఎడబాటు గురించిన హింట్ ఇచ్చారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది.
నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్ బాస్ 5 షో ఆదివారం ప్రారంభమైంది. షో ప్రారంభానికి ముందు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని అందరూ అనుకున్నారు. అయితే మీడియా ప్రతినిధులు తప్పనిసరిగా చైతూ-సామ్ గురించిన ప్రశ్నలు సంధిస్తారని తెలుసు కాబట్టి, ఆ ప్రశ్నలను ఎదుర్కోవడం కంటే ప్రెస్ మీట్ పెట్టకపోవడమే ఉత్తమమని ఆయన భావించినట్లు తెలుస్తోంది.
ఆయన మీడియాను కలవకపోవడానికి కారణం కొవిడ్ 19 అని ఆయన టీమ్ చెబుతోంది. కానీ ఫ్యాన్స్ సహా ఎవరూ ఆ జవాబుకు కన్విన్స్ కాలేదు. మొత్తానికి నాగ్ ప్రెస్‌ను కలవకపోవడం ఎవరినీ ఆశ్చర్యానికైతే గురిచేయలేదు. చైతూ-సమంత మధ్య అంతా సవ్యంగా ఉన్నట్లయితే ప్రెస్ మీట్‌ను నాగ్ ఎగ్గొట్టేవారు కాదనీ, కచ్చితంగా మీడియాను కలిసేవారనీ అనుకుంటున్నారు. ఎవరైనా వారికి సంబంధించిన ప్రశ్నలు వేస్తే, అదంతా రూమర్ అని కొట్టివేసేవారు. లేదూ.. ఆ ప్రశ్నను చైతన్య, సమంతనే అడగండని చెప్పేవారు. అలాంటిది.. మీడియాతో మీటింగ్‌ను వద్దనుకున్నారంటే.. కచ్చితంగా చైతన్య, సమంత మధ్య దూరం పెరిగిందనీ, వారు విడిపోనున్నారని చెప్పకనే చెప్పారనీ వినిపిస్తోంది.
అంతేకాదు, ఆగస్ట్ 29న నాగార్జున బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో ఆయన ఫ్యామిలీ అంతా పాల్గొనగా, వారిలో సమంత కనిపించకపోవడం అందరి దృష్టిలో పడింది. సరిగ్గా నెల రోజులకు అంటే అక్టోబర్ 7న చైతు-సమంత పెళ్లిరోజు వస్తోంది. అప్పటిలోగానే వారిద్దరూ విడిపోతున్న విషయం అధికారికంగా వెల్లడవుతుందని ఇండస్ట్రీలో ప్రచారమవుతోంది.
రెండు నెలల క్రితం వరకు ఆ ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నట్లు కనిపించగా, ఉన్నట్లుండి ఆకస్మికంగా వారి మధ్య దూరం పెరగడానికి కారణం ఏమిటనే విషయం కూడా చర్చకు వస్తోంది. చైతన్యను పెళ్లాడక ముందు సమంత పర్సనల్ లైఫ్ గురించిన వార్తలెన్నో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టేవి. చెన్నైకు చెందిన ఓ హీరోతో ఆమె సన్నిహితంగా మెలిగిందనేది వాటిలో ప్రధానమైంది. ఆ విషయం చైతన్యకు తెలియనిదేమీ కాదు. మరిప్పుడు మరే విషయం లేదా వ్యవహారం వారి మధ్య కలతలను సృష్టించింది? అవి సర్దుకుపోలేనంతటి విషయాలా? సరిదిద్దుకోలేనంతటి తీవ్రమైన సమస్యలా? అతి త్వరలోనే ఈ ప్రశ్నలకు జవాబు దొరకవచ్చు.
![]() |
![]() |