![]() |
![]() |
.jpg)
మాస్ ఎంటర్టైనర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కథానాయకుల్లో మాస్ మహారాజా రవితేజ ఒకరు. ఆయన నటించిన మాస్ ఎంటర్టైనర్స్ లో `వీర` ఒకటి. ఇందులో వీర, దేవా.. ఇలా రెండు విభిన్న ఛాయలున్న పాత్రలో రవితేజ ఆకట్టుకున్నారు. రవితేజకి జోడీగా కాజల్ అగర్వాల్, తాప్సీ నటించిన ఈ చిత్రానికి రమేశ్ వర్మ దర్శకత్వం వహించారు. `కిక్` శ్యామ్, శ్రీదేవి విజయ్ కుమార్, రోజా, ప్రదీప్ రావత్, నాజర్, పరుచూరి వెంకటేశ్వర రావు, సుధ, తెలంగాణ శకుంతల, అన్నపూర్ణ, బ్రహ్మానందం, అలీ, రాహుల్ దేవ్, నాగబాబు, అజయ్, కృష్ణుడు, ప్రవీణ్, వేణు మాధవ్, ప్రభాకర్, ధర్మవరపు సుబ్రమణ్యం, చలపతిరావు, సుబ్బరాజు, ప్రగతి, హేమ, సుప్రీత్, శ్రీనివాస రెడ్డి.. ఇలా ప్రముఖ తారాగణం ఇందులో కీలక పాత్రల్లో దర్శనమిచ్చారు.
ఎస్. ఎస్. తమన్ స్వరపరిచిన గీతాల్లో ``మావిళ్ళ తోపు`` (రీమిక్స్), ``చిట్టి చిట్టి``, ``వీర వీర``, ``ఎక్కడెక్కడ``, ``ఓ మేరీ`` మాస్ ఆడియన్స్ ని అలరించాయి. శాన్వి ప్రొడక్షన్స్ పతాకంపై గణేశ్ ఇందుకూరి నిర్మించిన ఈ చిత్రం.. 2011 మే 20న విడుదలైంది. రవితేజ అభిమానులను అలరించిన ఈ మాస్ ఎంటర్టైనర్.. నేటితో పది వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |