![]() |
![]() |

`విజేత` (2018)తో టాలీవుడ్ లో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్. కమర్షియల్ గా ఆశించిన విజయం సాధించనప్పటికీ.. కళ్యాణ్ కి నటుడిగా చెప్పుకోదగ్గ గుర్తింపుని అందించిందా సినిమా.
ఇదిలా ఉంటే.. `సూపర్ మచ్చి` పేరుతో కళ్యాణ్ దేవ్ చేసిన రెండో సినిమా.. కొన్నాళ్ళ క్రితమే చిత్రీకరణ పూర్తిచేసుకుంది. కరోనా కారణంగా సకాలంలో విడుదల కాలేకపోయింది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఈ సినిమాని ఓటీటీ వేదికలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. అంతేకాదు.. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థతో డీల్ జరుగుతోందని.. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశముందని అంటున్నారు. మరి.. `విజేత` తరువాత వస్తున్న ఈ సినిమా.. కళ్యాణ్ దేవ్ కి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
`సూపర్ మచ్చి`కి పులి వాసు దర్శకత్వం వహించగా.. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించింది. ఇందులో కళ్యాణ్ దేవ్ కి జంటగా శాండల్ వుడ్ భామ రచితా రామ్ నటించింది. యువ సంగీత సంచలనం తమన్ స్వరాలు సమకూర్చారు.
kalyan dev super machi in aha ott,kalyan dev super machi movie ready release ott, kalyaan dhev super machi movie direct on ott
![]() |
![]() |