![]() |
![]() |

సినీ ప్రియులకు, మంచి విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆశించేవారికి ఓటీటీ ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి వచ్చాక, వారి దాహం చాలావరకు తీరుతోంది. భిన్న తరహా, భిన్న భాషల సినిమాలు, సిరీస్‌లతో ఓటీటీ అలరిస్తోంది. వందల, వేల సినిమాలు, సిరీస్‌లు వరుసబెట్టి వస్తుండటంతో 24 గంటలు కూర్చొని చూసినా తనివితీరనంత చక్కని కంటెంట్ ఎంతో మిగిలే ఉంటోంది. ఈ నేపథ్యంలో జూలైలో వివిధ ఓటీటీ వేదికలపై వస్తున్న ఆసక్తికర సినిమాలు ఏవో ఓసారి చూద్దాం...
జూలై 2
పొగరు (ఆహా)
డైరెక్టర్: నందకిశోర్
తారాగణం: ధ్రువ సర్జా, రష్మికా మందన్న, సంపత్ రాజ్, ధనంజయ్
హసీన్ దిల్‌రుబా (నెట్‌ఫ్లిక్స్)
డైరెక్టర్: వినీల్ మాథ్యూ
తారాగణం: తాప్సీ పన్ను, హర్షవర్థన్ రాణే, విక్రాంత్ మాసే, ఆదిత్య శ్రీవాత్సవ
ద టుమారో వార్ (అమెజాన్ ప్రైమ్)
డైరెక్టర్: క్రిస్ మెక్‌కే
తారాగణం: క్రిస్ ప్రాట్, యోన్నే స్ట్రాహోస్కీ, జె.కె. సిమ్మన్స్, బెట్టీ గిల్పిన్, సామ్ రిచర్డ్‌సన్
జూలై 5
సారాస్ (అమెజాన్ ప్రైమ్)
డైరెక్టర్: జూడ్ ఆంథోనీ జోసెఫ్
తారాగణం: అన్నా బెన్, సన్నీ వేన్, సిద్దిఖ్
జూలై 7
మాన్‌స్టర్స్ ఎట్ వర్క్ (యానిమేషన్ - డిస్నీ ప్లస్ హాట్ స్టార్)
క్రియేటర్: పీట్ డాక్టర్
జూలై 9
స్టేట్ ఆఫ్ సీజ్: టెంపుల్ అటాక్ (జీ5)
డైరెక్టర్: కెన్ ఘోష్
తారాగణం: అక్షయ్ ఖన్నా, మంజరి ఫద్నిస్, అభిమన్యు సింగ్
కాలర్ బాంబ్ (డిస్నీ ప్లస్ హాట్ స్టార్)
డైరెక్టర్: ధ్యానేష్ జోటింగ్
తారాగణం: జిమ్మీ షేర్‌గిల్, ఆశా నేగి, నామన్ జైన్
జూలై 15
మాలిక్ (అమెజాన్ ప్రైమ్)
డైరెక్టర్: మహేశ్ నారాయణన్
తారాగణం: ఫహద్ ఫాజిల్, నిమిష సజయన్, జోజు జార్జ్
జూలై 16
తూఫాన్ (అమెజాన్ ప్రైమ్)
డైరెక్టర్: రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా
తారాగణం: ఫరాన్ అఖ్తర్, మృణాల్ ఠాకుర్, పరేశ్ రావల్
జూలై 23
ద లాస్ట్ లెటర్ ఫ్రమ్ యువర్ లవర్ (నెట్‌ఫ్లిక్స్)
డైరెక్టర్: అగస్టీన్ ఫ్రింజెల్
తారాగణం: ఫెలిసిటీ జోన్స్, షైలీన్ వుడ్లీ, కల్లమ్ టర్నర్, నభాన్ రిజ్వాన్, జో అల్విన్
హంగామా 2 (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్)
డైరెక్టర్: ప్రియదర్శన్
తారాగణం: పరేశ్ రావల్, శిల్పా శెట్టి, మీజాన్ జాఫ్రీ, ప్రణీత సుభాష్, రాజ్‌పాల్ యాదవ్, జానీ లీవర్, అశుతోష్ రాణా
జోల్ట్ (అమెజాన్ ప్రైమ్)
డైరెక్టర్: తాన్యా వెక్స్‌లర్
తారాగణం: కేట్ బెకిన్‌సేల్, బాబీ కానావేల్, లావెర్న్ కాక్స్, స్టాన్‌లీ టుక్సీ
![]() |
![]() |