![]() |
![]() |

అభినయానికి ఆస్కారమున్న పాత్రలకే ఓటేసే నాయికల్లో కేరళకుట్టి కీర్తి సురేశ్ ఒకరు. అయితే, ఇప్పటివరకు సాఫ్ట్ రోల్స్, ఫన్ రోల్స్ లోనే కనిపిస్తూ వచ్చిన కీర్తి.. త్వరలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుంది. అది కూడా.. డీ గ్లామరస్ రోల్ లో. అయితే, తెలుగులో కాకుండా తమిళంలో ఈ సాహసం చేస్తోంది కీర్తి. ఆ చిత్రమే.. `సాని కాయిదం`. ఇందులో విభిన్న చిత్రాల దర్శకుడు సెల్వ రాఘవన్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అరుణ్ మతేశ్వరన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
కరోనా రెండో దశ ఉధృతి తగ్గుముఖం పట్టడంతో.. మంగళవారం నుంచి `సాని కాయిదం` తాలూకు తాజా షెడ్యూల్ ని ప్రారంభించింది యూనిట్. చకచకా చిత్రీకరణ పూర్తిచేసి.. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాని రిలీజ్ చేసే దిశగా ప్లాన్ చేస్తున్నారు. మరి.. ఇప్పటివరకు నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించని కీర్తి.. ఆ తరహా పాత్రలో ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి మరి.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కీర్తి చేతిలో `సాని కాయిదం`తో పాటు సూపర్ స్టార్ మహేశ్ బాబు `సర్కారు వారి పాట`, సూపర్ స్టార్ రజినీకాంత్ `అణ్ణాత్తే` (తమిళ్) ఉన్నాయి. మరోవైపు మలయాళ చిత్రం `మరక్కార్`, తెలుగు చిత్రం `గుడ్ లక్ సఖి` విడుదలకు సిద్దమయ్యాయి.
![]() |
![]() |