![]() |
![]() |
.jpg)
బ్లాక్ బస్టర్ మూవీ `సింహా`(2010)లో నటసింహం నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. అందులో ఒక పాత్ర వైద్యుడు కాగా.. మరొకటి కాలేజ్ లెక్చరర్. ఈ రెండు పాత్రల్లోనూ తనదైన అభినయంతో అలరించారు బాలయ్య. కట్ చేస్తే.. సుదీర్ఘ విరామం అనంతరం బాలయ్య మరోమారు లెక్చరర్ పాత్రలో దర్శనమివ్వనున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. `డిక్టేటర్` (2016) తరువాత శ్రీవాస్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి నటసింహం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అంతేకాదు.. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఫన్ అండ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. త్వరలోనే బాలయ్య, శ్రీవాస్ కాంబినేషన్ మూవీపై క్లారిటీ రానున్నది. మరి.. `డిక్టేటర్`తో ఆశించిన విజయం అందుకోలేకపోయిన బాలయ్య, శ్రీవాస్ కాంబో.. సెకండ్ జాయింట్ వెంచర్ తోనైనా మెస్మరైజ్ చేస్తారో చూడాలి.
ఇదిలా ఉంటే.. బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ` చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తికానుంది. ఆపై గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ చిత్రం, అనిల్ రావిపూడితో మరో మూవీ చేయబోతున్నారు బాలయ్య. అవి పూర్తయ్యాకే శ్రీవాస్ డైరెక్టోరియల్ పట్టాలెక్కే అవకాశముందంటున్నారు.
![]() |
![]() |