![]() |
![]() |

ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తనయుడు సింహా.. 'మత్తువదలరా' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత 'తెల్లవారితే గురువారం' అనే సినిమాతో ఆడియన్స్ ను పలకరించగా అది అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇప్పుడు సింహా మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఆయన నటిస్తున్న కొత్త చిత్రం ఈరోజు(గురువారం) రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలను జరుపుకుంది.
ఈ సినిమాకి 'దొంగలున్నారు జాగ్రత్త' అనే టైటిల్ ను ఖరారు. గురు ఫిలిమ్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో.. సతీష్ త్రిపుర దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో సముద్రఖని ఒక కీలక పాత్రను పోషించనున్నాడు. 'అల వైకుంఠపురములో', 'క్రాక్' సినిమాలలో ప్రతినాయకుడిగా అలరించిన సముద్రఖని.. ఈ సినిమాలో కూడా ప్రతినాయక పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది.

'దొంగలున్నారు జాగ్రత్త' మూవీ పూజా కార్యక్రమంలో సింహాతో పాటు దర్శకనిర్మాతలు పాల్గొన్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది.
![]() |
![]() |