![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లోనే తొలిసారిగా ఓ పిరియడ్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. `హరిహర వీరమల్లు` పేరుతో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. మొఘలాయిల కాలం నాటి వాతావరణంతో తెరకెక్కుతోంది. ఇందులో రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ దర్శనమివ్వనున్నారు. వెర్సటైల్ డైరెక్టర్ క్రిష్ తీర్చిదిద్దుతున్న ఈ పాన్-ఇండియా వెంచర్ ఇప్పటికే సింహభాగం చిత్రీకరణ పూర్తిచేసుకుంది.
ఇదిలా ఉంటే.. 2022 సంక్రాంతి కానుకగా `హరిహర వీరమల్లు`ని రిలీజ్ చేయబోతున్నట్లు ఇదివరకు మేకర్స్ ప్రకటించారు. అయితే, కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో చిత్రీకరణలో జరిగిన జాప్యంతో పాటు.. రానాతో కలిసి పవన్ నటిస్తున్న మల్టిస్టారర్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్ ముగ్గుల పండక్కి షెడ్యూల్ కానుండడంతో.. ఈ భారీ బడ్జెట్ మూవీని 2022 వేసవికి విడుదల చేయబోతున్నట్లు సమాచారం. త్వరలోనే `హరిహర వీరమల్లు` విడుదల తేదిపై స్పష్టత రానున్నది.
కాగా, `హరిహర వీరమల్లు`లో పవన్ కి జోడీగా `ఇస్మార్ట్` బ్యూటీ నిధి అగర్వాల్, బాలీవుడ్ సుందరి జాక్వలైన్ ఫెర్నాండెజ్ నటిస్తున్నారు. స్వరవాణి కీరవాణి బాణీలు అందిస్తున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ ని.. స్టార్ ప్రొడ్యూసర్ ఎ.ఎం. రత్నం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.
![]() |
![]() |