![]() |
![]() |

లెక్క ప్రకారం చూస్తే.. అమ్మ డ్రీమ్ గాళ్ అయితే కూతురు జూనియర్ డ్రీమ్ గాళ్ అయిపోవాలి. కానీ.. తన విషయంలో అది మెటీరియలైజ్ కాలేదు. ఇంతకీ ఆమె ఎవరంటే.. డ్రీమ్ గాళ్ హేమమాలిని తనయ ఈషా డియోల్. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ `పెళ్ళి` (1997)కి రీమేక్ గా రూపొందిన `కోయి మేరే దిల్ సే పూచే` (2002)తో కథానాయికగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈషా.. ఆపై దాదాపు పాతిక సినిమాల్లో సందడి చేసింది. `ధూమ్` (2004) లాంటి ఒకటీ అరా సినిమాలు మినహాయిస్తే.. అమ్మడి ఖాతాలో విజయాలు తక్కువే. ఈ నేపథ్యంలో.. స్టార్ హీరోయిన్ అనిపించుకోకుండానే భరత్ తక్తానిని పెళ్ళాడి సినిమాలకు దూరమైంది. ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయిపోయిన ఈషా.. స్వల్ప విరామం అనంతరం కెమెరా ముందుకు రాబోతోందని సమాచారం.
అయితే, ఈ సారి సినిమా కోసం కాదు ఓ వెబ్ - సిరీస్ కోసం మేకప్ వేసుకోనుంది ఈ డాటరాఫ్ డ్రీమ్ గాళ్. ఆ వివరాల్లోకి వెళితే.. `రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్` పేరుతో అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో ఓ సిరీస్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. బ్రిటీష్ సిరీస్ `లూథర్` ఆధారంగా రూపొందనున్న ఈ థ్రిల్లర్ ఇన్వెస్టిగేటివ్ లో ఓ ముఖ్య పాత్రలో నటించేందుకు ఈషా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మరి.. రి-ఎంట్రీ బాట పడుతున్న ఈషాకి ఈ సిరీస్ ఎలాంటి గుర్తింపుని తీసుకువస్తుందో చూడాలి.
![]() |
![]() |