![]() |
![]() |

బంగాళా ఖాతంలో వాయుగుండం పడింది. ఏ నిమిషమైన తీరం దాటవచ్చు.ఫలితంగా భారీ వర్షాలు పడతాయి.వాతావరణ శాఖ చెప్పే ఈ డైలాగ్ ని వినని వాళ్ళు ఉండరు.ఇప్పుడు ఆ మాట టిల్లు స్క్వేర్ కి పర్ఫెక్ట్ గా సూటవ్వుతుంది. ఎందుకంటే టిల్లు కలెక్షన్స్ రోజురోజు కి ఒక రేంజ్ లో పెరుగుతున్నాయి. కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
మొన్న మార్చి 29 న టిల్లు స్క్వేర్( Tillu square) వరల్డ్ వైడ్ గా ల్యాండ్ అయ్యింది. అంటే వన్ వీక్ అవుతుంది. ఈ వన్ వీక్ లో రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ని సృష్టించింది.మొత్తం 94 కోట్ల గ్రాస్ తో ఒక పెను సంచలనాన్నే నమోదు చేసింది.ఈ మేరకు మేకర్స్ ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు.సిద్దు కెరీర్ లోనే ఇది హయ్యెస్ట్ గ్రాస్ అని చెప్పవచ్చు.అలాగే ఈ కలెక్షన్స్ టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా కూడా నిలిచాయి.ఇక సినిమాకున్న హిట్ టాక్ దృష్ట్యావంద కోట్ల మార్కుని అందుకోవడం పెద్ద కష్టమేమి కాదు. మరి చివరకి ఎక్కడ వరకు కలెక్షన్స్ ఆగుతాయో చూడాలి.

డిజె టిల్లు గా సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda)చేసిన పవర్ ఫుల్ యాక్టింగ్ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అనుపమ పరమేశ్వరన్ (anupama parameswaran) పెర్ఫార్మెన్సు కూడా కొత్తగా ఉండటం సినిమాకి కలిసి వచ్చింది.అలాగే మొదటి పార్ట్ లోని నేహా శెట్టి కూడా కనిపించడం ప్లస్ పాయింట్ అయ్యింది.నిర్మాతలు నాగ వంశీ,సౌజన్య లు ఖర్చుకి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. అదంతా స్క్రీన్ మీద కనపడుతుంది.మల్లిక్ రామ్ దర్శకత్వాన్ని వహించాడు.
![]() |
![]() |