![]() |
![]() |

దాదాపు 16 ఏళ్ళ క్రితం విడుదలైన మలయాళ చిత్రం `ప్రజాపతి`(2006)తో నటిగా తొలి అడుగేసింది అదితి రావ్ హైదరీ. అందులో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టికి జంటగా కనిపించింది. కట్ చేస్తే.. పదహారేళ్ళ తరువాత ఇప్పుడు మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ కి జోడీగా నటించింది అదితి. ఆ చిత్రమే.. `హే సినామిక`. ప్రధానంగా తమిళంలో రూపొందిన ఈ రొమాంటిక్ డ్రామాలో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ మరో కథానాయికగా ఎంటర్టైన్ చేయనుంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. `ప్రజాపతి`లో మమ్ముట్టికి భార్యగా అభినయించిన అదితి.. ఇప్పుడు `హే సినామిక`లోనూ దుల్కర్ సల్మాన్ కి శ్రీమతిగా దర్శనమివ్వబోతోంది. ఒకరకంగా.. అదితికి ఇది అరుదైన అనుభవమనే చెప్పాలి. మరి.. మమ్ముట్టి సరసన నటించిన సందర్భంలో విజయాన్ని అందుకోలేకపోయిన అదితి రావ్ హైదరి.. దుల్కర్ సల్మాన్ కి జంటగానైనా హిట్ కొడుతుందేమో చూడాలి.
Also Read: తారక్ తో దిశ చిందులు!?
కాగా, రేపు (మార్చి 3) సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనున్న `హే సినామిక`తో ప్రముఖ నృత్య దర్శకురాలు బృంద కెప్టెన్ గా తొలి అడుగేస్తున్నారు. తెలుగులోనూ ఈ క్రేజీ ప్రాజెక్ట్.. అనువాద రూపంలో అలరించనుంది.
![]() |
![]() |