![]() |
![]() |

నటరత్న నందమూరి తారక రామారావు పలు చిత్రాల్లో ద్విపాత్రాభినయంతో అలరించారు. వాటిలో 1967 నాటి `నిర్దోషి` ఒకటి. ఇందులో ఆనంద రావు, సుందరం అనే కవల సోదరులుగా రెండు విభిన్న పాత్రల్లో ఆకట్టుకున్నారు ఎన్టీఆర్. రామారావు కి జంటగా సావిత్రి, అంజలీ దేవి నటించిన ఈ సినిమాలో సత్యనారాయణ, పద్మనాభం, అల్లు రామలింగయ్య, గీతాంజలి, మిక్కిలినేని, రావి కొండల రావు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. వి. దాదామిరాసీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి డీవీ నరసరాజు సంభాషణలు సమకూర్చారు.
Also Read: అనసూయ కంటే ఎక్స్ ట్రా అందం రష్మిది!
తన సోదరుడు ఆనంద రావు (రామారావు) కారణంగా చేయని తప్పుకి జైలు పాలయిన సుందరం (రామారావు).. పలు నాటకీయ పరిణామాల అనంతరం నిర్దోషిగా ఎలా బయటపడ్డాడు? కమల (సావిత్రి), లక్ష్మి (అంజలీ దేవి) అతనికి ఎలా సహాయపడ్డారు? అనేది `నిర్దోషి` కథాంశం.
దిగ్గజ నేపథ్యగాయకులు ఘంటసాల సంగీతమందించిన ఈ సినిమాకి సి. నారాయణ రెడ్డి, కొసరాజు సాహిత్యమందించారు. పాటల్లో ``మల్లియలారా మాలికలారా.. మౌనముగా ఉన్నారా.. మా కథయే విన్నారా..`` ఎవర్ గ్రీన్ మెలోడీగా నిలిచింది. అలాగే, ``ఈ పాట నీ కోసమే``, ``సింగారి చెకుముకు రవ్వ``, ``చిన్నారి కృష్ణయ్య రారా``, ``సుకుసుకు``, ``ఔనన్నా కాదన్నా`` గీతాలు కూడా రంజింపజేశాయి. గౌతమి పిక్చర్స్ పతాకంపై ఎన్. రామబ్రహ్మం నిర్మించిన `నిర్దోషి`.. 1967 మార్చి 2న జనం ముందు నిలిచింది. నేటితో ఈ యాక్షన్ హిట్ 55 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |