![]() |
![]() |

'ఈ నగరానికి ఏమైంది', 'ఫలక్‌నుమాదాస్', 'హిట్' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అశోకవనంలో అర్జున కళ్యాణం'. ఇప్పటికే విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే మార్చి 4 న విడుదల కావాల్సిన ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు.
ఈ సినిమాలో పెళ్లి వయస్సు దాటిపోయాక పెళ్లికి సిద్ధమైన అల్లం అర్జున్ కుమార్ పాత్రలో విశ్వక్ సేన్ కనిపించనున్నాడు. మొదటి నుంచి ప్రమోషన్స్ లో కొత్తదనం చూపిస్తున్న మూవీ టీమ్ విడుదల తేదీ వాయిదాలోనూ కొత్తదనం చూపించింది. "అల్లం అర్జున్ కుమార్ జాతక రీత్యా మార్చ్ 4 వ తేదీన పెళ్లి ముహూర్తం సరికాదని జ్యోతిష్యులు తీర్మానించారు. కావున కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం. ఇట్లు, అల్లం వారి పెళ్లి బృందం" అంటూ ఒక ప్రకటనను విడుదల చేసింది మూవీ టీమ్. మరి అల్లం అర్జున్ కుమార్ పెళ్లికి ముహూర్తం ఎప్పుడు కుదురుతుందో.

బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్‌విసిసి డిజిటల్ బ్యానర్‌పై బి. బాపినీడు, సుధీర్ ఈదర నిర్మిస్తున్న ఈ సినిమాకు విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహిస్తున్నాడు.
![]() |
![]() |