![]() |
![]() |

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తన 169 వ చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ అధికారిక ప్రకటన వచ్చింది. సన్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ సినిమాని అధికారికంగా ప్రకటిస్తూ తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు.
'కోలమవు కోకిల' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన నెల్సన్ దిలీప్ కుమార్ మొదటి సినిమాతోనే సత్తా చాటాడు. ఇక ఆయన దర్శకత్వంలో రెండో సినిమాగా వచ్చిన 'డాక్టర్' సంచలన విజయాన్ని అందుకుంది. ఇక ఆయన దర్శకత్వంలో రూపొందుతోన్న మూడో సినిమా 'బీస్ట్'. విజయ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటానని కాన్ఫిడెంట్ గా ఉన్న నెల్సన్.. తన నాలుగో సినిమాకి ఏకంగా రజినీకాంత్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు.
నెల్సన్, రజినీకాంత్ కాంబినేషన్ తెరకెక్కనున్న సినిమాకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది. ఈ మేరకు మేకర్స్ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో సూపర్ స్టార్ లుక్ ఆకట్టుకుంటోంది. నెల్సన్ గత చిత్రాలకు సంగీతం అందించిన అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నట్లుగా వీడియోలో తెలిపారు.
![]() |
![]() |