![]() |
![]() |

'ఎస్ఎంఎస్(శివ మనసులో శృతి)' సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమయ్యాడు సుధీర్ బాబు. ఫిబ్రవరి 10, 2012న విడుదలైన ఈ సినిమా నేటితో పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నటుడుగా తన పదేళ్ల ప్రస్థానం గురించి సుధీర్ బాబు సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు.
"ఎస్ఎంఎస్ సినిమా విడుదలై నేటికి పదేళ్లు. జయాపజయాలతో సంబంధం నటుడిగా నా పదేళ్ల ప్రయాణం సంతృప్తినిచ్చింది. హారర్ కామెడీ, క్రైమ్ కామెడీ, యాక్షన్, రొమాంటిక్ ఇలా ఏ విధమైన సినిమా చేసినా నన్ను ఆదరించారు. భవిష్యత్తులో మిమ్మల్ని మరింతగా అలరిస్తానని మాట ఇస్తున్నాను. నా ఈ పదేళ్ల ప్రయాణంలో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. త్వరలోనే 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాతో కలుద్దాం" అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక నోట్ విడుదల చేశాడు సుధీర్.

సూపర్ స్టార్ కృష్ణ అల్లుడుగా, మహేష్ బాబు బావగా టాలీవుడ్ కి పరిచయమైన సుధీర్ బాబు.. తనదైన నటన, విభిన్న చిత్రాల ఎంపికతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 'ప్రేమ కథా చిత్రమ్', 'సమ్మోహనం', 'శ్రీదేవి సోడా సెంటర్' వంటి సినిమాలు సుధీర్ కి మంచి పేరు తీసుకొచ్చాయి. బాలీవుడ్ లోనూ అవకాశాలను దక్కించుకుంటున్నాడు.
![]() |
![]() |