![]() |
![]() |

నయనతార, సమంత, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రధారులుగా నటిస్తోన్న చిత్రం 'కాదు వాకుల రెండు కాదల్'. విఘ్నేశ్ శివన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ రొమాంటిక్ కామెడీ మూవీ టీజర్ రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని ఓ పోస్టర్ ద్వారా విఘ్నేశ్ శివన్ పంచుకున్నాడు. ఆ పోస్టర్‌లో ముగ్గురు ప్రధాన పాత్రధారులూ ఒక షిప్‌పై నిల్చొని ఉన్నట్లు కనిపిస్తున్నారు. సేతుపతి మధ్యలో నిల్చొని ఉండగా, ఆయనకు చెరో పక్క నయనతార, సమంత నిల్చొని చేతులు చాపి ఆయన ముఖం వంక చూస్తున్నారు. సేతుపతి వారిని చెరో చేత్తో పట్టుకొని వున్నాడు. నయన్, సామ్ ఇద్దరూ ఒకే రకమైన డ్రస్ ధరించి ఉన్నారు.
'కాదు వాకుల రెండు కాదల్'ను విఘ్నేశ్, నయన్ సొంత ప్రొడక్షన్ హౌస్ రౌడీ పిక్చర్స్, సెవన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రభు, కళ మాస్టర్, సీమ, ఎస్. శ్రీశాంత్ కీలక పాత్రలు చేస్తోన్న ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఎస్.ఆర్. కదిర్ సినిమాటోగ్రాఫర్‌గా, ఎ. శ్రీకర ప్రసాద్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.

![]() |
![]() |