![]() |
![]() |

శర్వానంద్, రష్మిక మందన్న జంటగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఆడవాళ్ళు మీకు జోహార్లు'. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 25 న థియేటర్స్ లో విడుదల కానుంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్ ని తాజాగా రిలీజ్ చేశారు. కలర్ ఫుల్ గా ఉన్న ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
'ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమా టీజర్ ను గురువారం సాయంత్రం విడుదల చేశారు. "ప్రతి మగాడి జీవితంలో పెళ్లి అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. కానీ ఇంట్లో ఒక పదిమంది ఆడవాళ్ళు ఉండి, పెళ్ళికి ఒకమ్మాయిని ఓకే చేయడం అంటే ఇంచుమించు నరకం" అంటూ శర్వానంద్ చెప్పే డైలాగ్ తో ఈ టీజర్ ప్రారంభమైంది. పెళ్లి కోసం పరితపించే యువకుడిగా టీజర్ లో శర్వానంద్ నవ్వులు పూయించాడు. 'మనం రిజెక్ట్ చేసే స్టేజ్ నుంచి వాళ్ళు రిజెక్ట్ చేసే స్టేజ్ కి తీసుకొచ్చారన్నమాట', 'కొట్టేస్తాను నిన్ను' వంటి డైలాగ్స్ తో టీజర్ ఆద్యంతం వినోదంగా సాగింది. రష్మిక, వెన్నెల కిషోర్ తో శర్వానంద్ సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం ఆహ్లాదకరంగా ఉంది. కిషోర్ తిరుమల మార్క్ సీన్స్, డైలాగ్స్ తో టీజర్ ఆకట్టుకునేలా ఉంది.

కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్ 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. టీజర్ చూస్తుంటే ఈ సినిమాతో శర్వానంద్ మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వచ్చేలా ఉన్నాడు.
![]() |
![]() |