![]() |
![]() |

రానా సమర్పించు సురేష్ ప్రొడక్షన్స్ మూవీ 'కృష్ణ అండ్ హిజ్ లీల' ఓటీటీలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే, ఒక్క ఓటీటీ ఫ్లాట్‌ఫార్మ్‌లో కాదు... రెండిటిలో ఈ సినిమా విడుదల కానుంది. జూన్ 25న (ఈ గురువారమే) నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా విడుదల కానుంది. వారం తరవాత తెలుగు అచ్చ తెలుగు ఒటీటీ ఫ్లాట్‌ఫార్మ్ 'ఆహా'లో విడుదల కానుంది. జూలై 4 నుండి ఆహాలో 'కృష్ణ అండ్ హిజ్ లీల' స్ట్రీమింగ్ కానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా... శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు రవికాంత్ పేరెపు దర్శకుడు. 'క్షణం' తరవాత అతడు తీసిన సినిమా ఇది. ముగ్గురు అమ్మాయిలతో వివిధ దశలలో ప్రేమలో పడిన ఓ అబ్బాయి కథే సినిమా కాన్సెప్ట్. ఆల్రెడీ రెండు టీజర్లు రిలీజ్ చేశారు. రెండూ యూత్‌ని అట్ట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. మోడరన్ లవ్ స్టోరీగా సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.
![]() |
![]() |