![]() |
![]() |

అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కి ఎక్కిన ఘనత విజయ నిర్మల సొంతం. ఆవిడ దర్శకురాలు మాత్రమే కాదు... కథానాయికగా, నటిగా వందల చిత్రాలు చేశారు. నిర్మాతగా కొన్ని చిత్రాలు తీశారు. ఎంతో చరిత్ర ఉన్న విజయ నిర్మల జీవితంపై సినిమా వస్తుందని కొన్ని రోజులుగా ఫిలిం నగర్లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది.
'మహానటి'లో సావిత్రిగా ప్రేక్షకులను మెప్పించిన కీర్తీ సురేష్‌ను బయోపిక్ రూపకర్తలు సంప్రదించారనీ, విజయ నిర్మల పాత్రలో నటించవలసిందిగా కీర్తీని అడిగారని సదరు వార్త సారాంశం. విజయనిర్మల తనయుడు, నటుడు నరేష్ ఆ వార్తను కొట్టిపారేశారు. తన తల్లి బయోపిక్ తీసే పర్మిషన్ ఎవరికీ ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే, తన తల్లి చరిత్రను రాసే పనిలో ఉన్నానని ఆయన తెలిపారు.
"అమ్మ ఒక రోజు తన బయోపిక్ కోసం స్క్రిప్ట్ రాయమని నన్ను అడిగింది. నేను వర్క్ స్టార్ట్ చేశా. తర్వాత కొన్ని రోజులకు అమ్మ ఆరోగ్యం బాలేదు. ఆ తర్వాత ఆవిడ ఈలోకాన్ని విడిచి వెళ్లడంతో నేను రాయడం కొంచెం తగ్గించా. అమ్మ జీవితంలో ఎన్నో కోణాలు ఉన్నాయి. ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. అమ్మ బయోపిక్ స్క్రిప్ట్ పూర్తి చేయడానికి మరో ఏడాది కంటే ఎక్కువ సమయమే పడుతుంది" అని నరేష్ తెలిపారు.
![]() |
![]() |