![]() |
![]() |
.jpg)
'రాజ్‌దూత్' సినిమాతో దివంగత నటుడు శ్రీహరి చిన్న కుమారుడు మేఘాంశ్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కథానాయకుడిగా అడుగుపెట్టారు. అయితే... అతడికి ఆశించిన పేరు రాలేదు. దాంతో 'రాజ్‌దూత్' తర్వాత కొంత విరామం తీసుకున్నాడు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే... రెండో సినిమాకి మేఘాంశ్ శ్రీహరి రెడీగా ఉన్నాడు. మారుతి దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన ముని అనే యువకుడు చెప్పిన కథకు అతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రంగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.
'రాజ్‌దూత్'తో కామెడీ, ఫైట్స్ అంటూ కమర్షియల్ ఫార్మటులో వెళ్లడానికి ప్రయత్నించిన మేఘాంశ్ శ్రీహరి, రెండో సినిమాకి రియాలిటీగా దగ్గరగా ఉండే రొమాంటిక్ థ్రిల్లర్ కథను సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ సినిమాలో అతడు అనంతపురం యువకుడిగా కనిపించనున్నాడు. ఫస్టాఫ్ అంతా అనంతపురం నేపథ్యంలో సాగుతుందట. అబుదాబి నేపథ్యంలో దర్శకుడు ముని సెకండాఫ్ రాసుకున్నాడట. కరోనా తర్వాత పరిస్థితుల నేపథ్యంలో విదేశాల్లో షూటింగ్ చేయడం రిస్కుతో కూడుకున్న వ్యవహారం కనుక స్టోరీ సెట్టింగ్ ఏమైనా మారుస్తారేమో చూడాలి.
![]() |
![]() |