![]() |
![]() |
.jpg)
ఐశ్వర్య అంటే ఐశ్వర్యా రాయ్ బచ్చన్ కాదు! మన తెలుగు అమ్మాయి... తమిళనాట కథానాయికగా, నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్. తెలుగులో 'వరల్డ్ ఫేమస్ లవర్', 'కౌసల్య కృష్ణమూర్తి', 'మిస్ మ్యాచ్' చిత్రాల్లో నటించారు. ఆమె ఇప్పుడు వెన్నునొప్పితో బాధ పడుతున్నారు. అయితే... అంత తీవ్రమైన వెన్నునొప్పితో కాదని సమాచారం. అసలు ఈ సమస్య రావడానికి కారణం భరతనాట్యం.
లాక్ డౌన్ వల్ల ఇంటికి పరిమితమైన ఐశ్వర్య రాజేష్, ప్రస్తుతం భరత నాట్యం నేర్చుకున్నారు. ఆమె తల్లి క్లాసికల్ డాన్సర్. అందుకని ఐశ్వర్య రాజేష్ కూడా క్లాసికల్ డాన్స్ నేర్చుకోవాలని చిన్నప్పటినుండి అనుకునేవారు. చిన్నతనంలో ఆమె కొన్ని రోజులు కూచిపూడి నేర్చుకున్నారు. కానీ, కంటిన్యూ చేయలేదు. ఇప్పుడు సమయం దొరకడంతో నేర్చుకుంటున్నారు.
"భరతనాట్యం నేర్చుకోలేక పోయినందుకు ఎప్పుడూ చింతిస్తూ ఉండేదాన్ని. లాక్ డౌన్ వల్ల ఫ్రీ టైమ్ దొరకడంతో స్కైప్ లో క్లాసులు చెప్పే టీచర్ ఎవరైనా ఉంటే చెప్పమని కికి విజయ్ ని అడిగా. ఆమె కళాక్షేత్ర డాన్సర్, ట్యూటర్ కాళీని సజెస్ట్ చేసింది. రోజూ రెండు గంటల పాటలు భరతనాట్యం ప్రాక్టీస్ చేస్తున్నా. వెన్నునొప్పి వల్ల ఇప్పుడు బ్రేక్ ఇచ్చాను. తగ్గిన తర్వాత మళ్లీ నేర్చుకుంటా" అని ఐశ్వర్య రాజేష్ తెలిపారు. భరతనాట్యం తోపాటు ఖాళీ సమయాల్లో కథలు చదువుతూ అప్పుడప్పుడు వంట చేయడం ట్రై చేస్తూ సమయం గడిపేస్తున్నారట.
![]() |
![]() |