![]() |
![]() |

కరోనా కాలంలో క్రియేటివిటీ కొత్త పుంతలు తొక్కుతోంది. యంగ్ ఫిల్మ్ మేకర్స్ తమ ఆలోచనలకు పదును పెడుతున్నారు. ఇంతకు ముందు సినిమా తారలతో చిన్న యాడ్ తీయాలన్నా.... భారీ సెట్ అప్ అవసరం అయ్యేది. ఇప్పుడు అటువంటి సెట్ అప్ సెట్ చేయడం సాధ్యమయ్యే పని కాదు. అందువల్ల, తమలో క్రియేటివిటీని బయటకు తీస్తున్నారు. జస్ట్... ఫోనుతో అని కానిస్తున్నారు. ఆండ్రియా ప్రధాన పాత్రలో 'లాక్ డౌన్' అని ఒక షార్ట్ ఫిలిం అలాగే తీశారు. మూడు నిమిషాల నిడివి గల షార్ట్ ఫిలింలో ప్రస్తుత పరిస్థితుల్లో ఒక అమ్మాయి ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయో చూపించారట. దీనికి రచన, దర్శకత్వం ఆధవ్ కన్నదాసన్. వీడియో కాల్స్ ద్వారా అతను డైరెక్ట్ చేశాడు. అయితే షూట్ చేసింది మాత్రం వేరే వ్యక్తి... ఆండ్రియా ఇంటికి దగ్గరలో ఉండే సినిమాటోగ్రాఫర్ నితిన్ రామ్. షూటింగ్ చేసేటప్పుడు భౌతిక దూరం పాటించారట. ఇప్పటికే తెలుగులో ఈ విధమైన షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, వరుణ్ తేజ్, సాయి తేజ్ నటించిన కరోనా పాటను ఎవరి ఇంట్లో వారు ఉంటూ ఫోనులోనే షూట్ చేశారు. అమితాబ్ బచ్చన్, చిరంజీవి, మోహన్ లాల్ తదితరులు ఇదే విధంగా ఒక షార్ట్ ఫిలిం చేశారు. తెలుగులో టీవీ తారలు కూడా మరో షార్ట్ ఫిలిం చేశారు. ఇంటిలో ఇంకెంత మంది చేరతారో చూడాలి.
![]() |
![]() |