![]() |
![]() |

బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా చాలా బోల్డ్. తన అభిప్రాయం తను ఏమాత్రం దాచుకోకుండా నిర్మొహమాటంగా చెప్పేస్తారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోయిన్లలో సోనాక్షి ఒకరు. అయితే... లాక్ డౌన్ సమయంలో పెద్దగా కనిపించడం లేదు. ఎందుకు? ఈమధ్య సోషల్ మీడియాలో సోనాక్షి సిన్హాపై సెటైర్స్ చాలా పడ్డాయి. ట్రోల్స్ ఎన్నో వచ్చాయి. దీనంతటికీ కారణం... దూరదర్శన్ చానల్ లో మళ్లీ 'రామాయణ్' సీరియల్ టెలికాస్ట్ కావడం.
గత ఏడాది 'కౌన్ బనేగా కరోడ్ పతి' కార్యక్రమానికి సోనాక్షి సిన్హా వెళ్లారు. ఇప్పుడు ఆమెను రామాయణానికి సంబంధించిన ఒక ప్రశ్న అడిగారు. సమాధానం చెప్పడానికి లైఫ్ లైన్ వాడుతున్నారు. రామాయణం గురించి కనీస అవగాహన లేదని కొందరు కామెంట్ చేశారు. డీడీలో మళ్ళీ 'రామాయణ్' సీరియల్ టెలికాస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నటుడు ముఖేష్ ఖన్నా "రామాయణం గురించి ఏమీ తెలియని ఈ తరానికి ముఖ్యంగా సోనాక్షి సిన్హా లాంటి వాళ్లకు రామానంద్ సాగర్ దర్శకత్వం వహించిన సీరియల్ సహాయం చేస్తుంది" అని కామెంట్ చేశారు. మళ్ళీ సోనాక్షి సిన్హాపై సెటైర్స్ స్టార్ట్ అయ్యాయి. వాటిని దృష్టిలో పెట్టుకునే సోషల్ మీడియా అన్ని దూరమయ్యారా? అని కొందరు అనుకున్నారు. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో సోనాక్షి సిన్హా క్లారిటీ ఇచ్చారు.
"నేను ట్రోల్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వను. నా సోషల్ మీడియా పేజీల్లో వాటికి ఫుల్ స్టాప్ పెట్టా. ఎవరో ఏదో కామెంట్ చేస్తే నేను ఎందుకు బాధ పడాలి. ట్రోల్స్ నన్ను బాధ పెట్టలేవు" అని సోనాక్షి సిన్హా అన్నారు. కుటుంబం అంతా ఒకచోట ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ఎందుకు? అని ఆమె ప్రశ్నించారు. సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్న వారికి తాను వ్యతిరేకం కాదని, కానీ ఇంట్లో సభ్యులతో సంతోషంగా గడుపుతున్నానని చెప్పుకొచ్చారు.
![]() |
![]() |