![]() |
![]() |

రామ్ గోపాల్ వర్మ కాంపౌండ్ నుండి వచ్చిన 'భైరవగీత' సినిమాలో హీరో ధనుంజయ్ ఉన్నాడు కదా! అతడికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ నుండి పిలుపు వెళ్లింది. 'ఆర్య', 'ఆర్య 2' తరవాత అల్లు అర్జున్ హీరోగా ఆయన తెరకెక్కిస్తున్న హ్యాట్రిక్ సినిమా 'పుష్ప'లో ఇంపార్టెంట్ రోల్ చేయాల్సిందిగా అతడిని అడిగారట. పాత్ర నిడివి పెద్దది కాకపోయినా కథలో ప్రాధాన్యం ఉన్నది కావడం, పైగా అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో సినిమా కావడంతో కన్నడ నటుడైన ధనుంజయ్ అంగీకరించాడని సమాచారం. ఆ క్యారెక్టర్ పాజిటివా? నెగెటివా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత షూటింగులు స్టార్ట్ అయితే... డేట్స్, అవైలబిలిటీ బట్టి 'పుష్ప' షూటింగులో ధనుంజయ్ పాల్గొంటాడు. అతడితో పాటు మరో కన్నడ నటుడు రాజ్ దీపక్ శెట్టి కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. అతడిది విలన్ రోల్. జగపతిబాబు కూడా 'పుష్ప'లో విలనే. చిత్తూరు నేపథ్యంలో ఎర్రచంద్రనం స్మగ్లింగ్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది.
![]() |
![]() |