![]() |
![]() |

టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్.. తేడా లేకుండా సినిమా సెలబ్రిటీలు ప్రస్తుత కరోనా సంక్షోభ కాలంలో రకరకాల ఛాలెంజ్‌లతో టైమ్ పాస్ చేస్తున్నారు. ఎప్పుడూ షూటింగ్‌లతోనో, ఇతర వ్యాపకాలతోనో బిజీగా ఉండేవాళ్లు.. ఇప్పుడు బయట తిరిగే అవకాశం లేకపోవడం, షూటింగ్స్ లేకపోవడం, లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉండాల్సి రావడం వల్ల బోర్ ఫీలవుతున్నారు. ఆ బోర్‌డమ్ నుంచి తప్పించుకోడానికి ఎన్ని రకాల పనులు చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. లేటెస్ట్‌గా ఇప్పుడు పిల్లో చాలెంజ్ అనేది పుట్టుకొచ్చింది. సాధారణంగా రకరకాల ఫ్యాన్సీ డ్రస్సులతో, డిజైనర్స్ రూపొందించే ఫ్యాషన్ డ్రస్సులతో తళతళలాడే సెలబ్రిటీలు కొంతమంది ఇప్పుడు ఇంట్లో ఉన్న పిల్లోలను డ్రస్‌లాగా ధరించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
హాలీవుడ్ అగ్రతారల్లో ఒకరైన హాలే బెర్రీ ఆ పిల్లో చాలెంజ్‌ను స్వీకరించి డార్క్ బ్లూ పిల్లోను డ్రస్ లాగా ధరించి ఆ పిక్చర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. "నన్ను పిల్లో ఛాలెంజ్ నుండి దూరంగా ఉంచలేరని మీకు ఇప్పటికే తెలుసు" అంటూ ఆమె రాసుకొచ్చింది. హాలే బెర్రీ చేయగా లేంది, నేను చేయలేనా అనుకుంది కాబోలు.. మన 'ఆర్ఎక్స్ 100' భామ పాయల్ రాజ్‌పుత్ కూడా పిల్లో చాలెంజ్ టేకప్ చేసింది. ఎల్లో కలర్ పిల్లోను డ్రస్‌లాగా ధరించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ పిక్చర్‌ను షేర్ చేసింది. ఇంట్లో ఉండి బోర్ కొట్టి చస్తున్నాననీ, అందుకే పిల్లో డ్రస్‌తో క్వారన్ క్వీన్‌గా మారాననీ చెప్పింది. 'వెంకీమామ'లో వెంకటేశ్ జోడీగా చేశాక, ఆమెకు టాలీవుడ్‌లో ఆశించిన రీతిలో ఆఫర్లు రాలేదు.

.jpg)
![]() |
![]() |