![]() |
![]() |
.jpg)
సెంటిమెంట్లు..మనిషి జీవితం మొత్తం వీటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఫలానా వ్యక్తి హస్తవాసి మంచిదనో, అమ్మ ఎదురు వస్తే కలిసివచ్చిందనో ఇలా ఒక వ్యక్తి లైఫ్‌పై సెంటిమెంట్లు చాలా ప్రభావం చూపిస్తాయి. అలాంటిది సినీ పరిశ్రమ సంగతి వేరుగా చెప్పక్కర్లేదు. ఫలానా వాళ్లు స్వీచాన్ చేసినా, ఫస్ట్ కాపీ వారి చేత్తో ఇస్తే బాగుంటుందంటే వాళ్ల వెంట పడుతుంటారు..అదే రిజల్ట్ తేడా వస్తే పిలవాలంటేనే వణుకుతారు. కానీ తనకు తానే సెంటిమెంట్ ఫిలైపోయి..ఎదుటి వారు బాగుండాలని కోరుకునే వ్యక్తి ఇండస్ట్రీలో ఒకరున్నారు.. ఆయన ఎవరో కాదు ఎన్టీఆర్. రానా నటించిన ఘాజీ సినిమాను తెలుగు, తమిళ, హిందీల్లో ఏకకాలంలో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేశారు.
ఇందులో భాగంగా హిందీ వెర్షన్‌కు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ చెప్పారు. మరి తెలుగులో ఎవరు..? అనుకుంటున్నపుడు చిరంజీవి, ఎన్టీఆర్ పేర్లు తెరపైకి వచ్చాయి. చిరంజీవి కన్నా ముందు ఎన్టీఆర్‌ను ఇదే విషయమై సంప్రదించగా..దీనిని ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు టాక్. తాను వాయిస్ ఓవర్ చెప్పిన సినిమాలు అంతగా సక్సెస్ కాలేదని, తన వల్ల ఒకరికి మంచి జరగాలన్నదే తన అభిమతమని ఎన్టీఆర్ చెప్పినట్లు ఫిలింనగర్ టాక్. దీంతో వారు చిరంజీవిని సంప్రదించడం ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం అయిపోయింది.. అన్నట్లు ఘాజీ తమిళ్ వెర్షన్‌కి సూర్య వాయిస్ ఇచ్చారు.
![]() |
![]() |