![]() |
![]() |

సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ..ఒక్కసారిగా స్టార్ ప్రొడ్యూసర్‌గా మారిపోయాడు బండ్ల గణేష్..రాత్రికి రాత్రే ఆయన నిర్మాతగా మారడం వెనుక చాలా మంది బడా బాబుల హస్తం ఉందని పలువురు బహిరంగంగానే విమర్శించారు..సరే అవన్నీ పక్కనబెడితే నిర్మాతగా బండ్ల గణేష్ మిశ్రమ ఫలితాలు సాధించాడనే చెప్పుకొవచ్చు. ఒకప్పుడు బడా నిర్మాణ సంస్థలకు పోటీగా మారతాడనుకున్న గణేష్‌ను వరుస ఫ్లాప్‌లు పలకరించడంతో సైడయిపోయాడు. తాజాగా బండ్ల అమ్మాయిల బ్రోకర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ మీరా చోప్రా. దీనిపై ఓ ట్వీట్ పెట్టి ఆ తర్వాత డిలిట్ చేసింది.
ఆ వెంటనే హీరో సచిన్ జోషి కూడా దీనికి మద్ధతుగా గణేష్ అలాంటి వాడేనని ఆరోపించాడు. సమయం వచ్చినపుడు నిజాలను బయటపెడతానని పేర్కొన్నాడు. ఇక్కడ ఒక విషయం మనం గుర్తు పెట్టుకోవాలి..బండ్ల గణేష్‌కు జోషికి మధ్య విబేధాలున్నాయి కాబట్టి ఏదో ఆయనపై ఉన్న అక్కసుతో అనేశాడులే అనుకోవచ్చు..కానీ మీరా చోప్రా కామెంట్లే ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.. మీరా ఎప్పుడూ బండ్ల గణేష్ బ్యానర్‌లో చేయ్యలేదు..కనీసం ఇద్దరికి ఎలాంటి పరిచయం లేదు..అటువంటప్పుడు మీరా ఈ స్థాయిలో ఎందుకు విరుచుకుపడినట్లు..?
![]() |
![]() |