![]() |
![]() |
.jpg)
సినిమాల్లో నటించాలని కోరిక చాలా మందికి వుంటుంది. కాని, అవకాశం కొద్ది మందికే వస్తుంది. అవకాశం తనంత తాను వచ్చినప్పుడు నటించటం సరే... మనకై మనం అవకాశాన్ని అందిపుచ్చుకుంటే? ఆ అనుభూతే వేరు! తెలుగువన్ తెరపైకి తెచ్చిన పాష్ పోరీస్ లో ఒకరు ది అమేజింగ్ అదితి మ్యానికల్. ఆమె ఇప్పుడు అలాంటి స్వీట్ సక్సెస్ నే ఎంజాయ్ చేస్తోంది!
.jpg)
తెలుగువన్ ప్రొడ్యూస్ చేసిన పాష్ పోరీస్ వెబ్ సిరీస్ లో శేషమ్మగా నటించింది అదితి. ఆ సీరిస్ ఫాలో అయిన వారికందరికీ శేషమ్మ ఎంత హాట్ అండ్ టాలెంటెడో తెలిసిందే. ఆ క్రమంలోనే ఇప్పుడు అదితి మీనింగ్ ఫుల్ చిత్రాల దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ కంటపడింది! ఆయన తన ప్రజెంట్ మూవీలో అదితిని ఒక హీరోయిన్ గా తీసుకున్నారు. గతంలో ఇంద్రగంటి తీసిన అంతకు ముందు ఆ తరువాత సినిమా హీరోయిన్ ఈష మరో హీరోయిన్. ఇక హీరోలుగా అడవి శేష్, అవసరాల శ్రీనివాస్, వెన్నల కిషోర్ నటిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం నానితో జెంటిల్ మ్యాన్ లాంటి సినిమా తరువాత ఇంద్రగంటి చేస్తున్న సినిమా. అందుకే, మంచి ఎక్స్ పెక్టేషన్స్ వున్నాయి ఆడియన్స్ లో.
నిన్న మొన్నటి వరకూ సినిమాల్లో షైన్ అవ్వాలంటే మోడలింగ్ ద్వారా వచ్చే వారు అమ్మాయిలు. అది వీలుకాని వారు హీరోయిన్ అవ్వటం ఎంతో కష్టంగా వుండేది. తెలుగువన్ పాష్ పోరీ అదితి సక్సెస్ పెరిగిపోతోన్న వెబ్ మ్యానియాకి చక్కటి నిదర్శనం! సినిమాకి వెబ్ ఇప్పుడు న్యూ గేట్ వే అయిపోయిందనవచ్చు!
![]() |
![]() |