![]() |
![]() |

టాలీవుడ్ కుర్ర హీరోల్లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. లాస్ట్ క్యాలెండర్ ఇయర్‌లో కళ్యాణ వైభోగమే, జ్యో అచ్యుతానంద సినిమాలతో రెండు హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు శౌర్య. దీంతో ఈ హీరో నెక్ట్స్ ఏం చేస్తాడా అని ప్రేక్షకులు ఎదురుచూస్తుండగా నాగశార్య మాత్రం ఇంత వరకు ఏ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేయలేదు. ఓ నిర్మాత విషయంలో నాగశౌర్య ప్రవర్తన ఏ మాత్రం బాగోలేదట. సినిమా చేస్తానని చెప్పి సదరు నిర్మాత దగ్గర భారీ మొత్తంలో అడ్వాన్స్ తీసుకుని ఆ సినిమాను ఇంతవరకు ఫైనల్ చేయలేదట. అంతేకాదు సొంతంగా తానో ప్రొడక్షన్ పెట్టే ఆలోచనలో ఉన్నాడట..తన సొంత బ్యానర్‌లో సినిమా చేసిన తర్వాతే నీ విషయం చూస్తానని చెప్పాడట . దీంతో తన గోడును పరిశ్రమలో ఉన్న పెద్దల వద్ద చెప్పుకోవడంతో నాగశౌర్య వైపు వెళ్లాలంటేనే నిర్మాతలు భయపడుతున్నారట..అందుకే శౌర్యకి ఏ అవకాశం రావడం లేదట.
![]() |
![]() |