![]() |
![]() |

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను తెరకెక్కించాలని ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు కాదు ఒక రకంగా పోటీ పడుతున్నారని చెప్పవచ్చు. అయితే వీరిలో అత్యంత వేగంగా స్పందిస్తున్నారు దర్శకరత్న దాసరి నారాయణరావు. తాజాగా ఆయన "అమ్మ" అనే టైటిల్‌ను ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించారు. ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించాలని దాసరి భావిస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ మొదలెట్టిన దాసరి, మరో వైపు అమ్మ పాత్ర కోసం అన్వేషణ ప్రారభించినట్లు తెలుస్తోంది. జయలలిత పాత్రకు ఎవరైతే న్యాయం చేస్తారా అన్న కోణంలో దాసరి వాకబు చేస్తున్నట్లు టాక్. ఈ రేసులో రమ్యకృష్ణ అందరికంటే ముందు ఉన్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను వీలైనంత త్వరలో తెరకెక్కించి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ చేయనున్నారని సమాచారం.
![]() |
![]() |