![]() |
![]() |

యువ హీరోల రేసులో ముందుకు దూసుకుపోతున్నాడు రాజ్ తరుణ్. ఒక్క క్షణం కూడా తీరిక లేని షెడ్యూల్ తనది. ప్రస్తుతం రాజ్ తరుణ్ చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో.. `కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త` ఒకటి. అను ఇమ్మానియేల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి `దొంగాట`తో ఆకట్టుకొన్న వంశీ కృష్ణ దర్శకుడు. జనవరి 1 సందర్భంగా టీజర్ రిలీజ్ అయ్యింది.
ఈ టీజర్‌లో అమ్మాయిలకు బోల్డన్ని బిస్కెట్లు వేశాడు రాజ్ తరుణ్.. అమ్మాయిలు, మందూ ఒక్కటేరా మచ్చ.. కాస్త కాన్సట్రేషన్ చేస్తే కనెక్ట్ అయిపోతాం - కంటిన్యూ చేస్తే చచ్చిపోతాం అనే డైలాగ్‌తో టీజర్ మొదలైంది. ఇక అక్కడి నుంచి అనుఇమ్మానియేల్‌ని ఫ్లాట్ చేస్తూ రెండు మూడు బిస్కెట్ డైలాగులు వేశాడు తరుణ్. చూస్తుంటే.. ఓ అమ్మాయిని పడేయడానికి ఓ అబ్బాయి పడే పాట్లు ఈ సినిమా అనిపిస్తోంది. ఈ సినిమాలో రాజ్ తరుణ్ కుక్కల కిడ్నాపర్‌గా కనిపించబోతున్నాడు. ఫిబ్రవరికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ట్రైలర్ ఫన్నీగా సాగింది.. సినిమాలోనూ అంతే ఫన్ ఉంటే.. రాజ్ తరుణ్ ఖాతాలో మరో హిట్టు పడిపోయినట్టే.
![]() |
![]() |