![]() |
![]() |

ఈ సంక్రాంతి సమరానికి కాలు దువ్వుతున్న చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెం.150కి పెద్ద షాక్. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని ఈనెల 4న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చేయాలని చిత్రబృందం నిర్ణయించిన సంగతి తెలిసింది. అక్కడి అధికారుల అనుమతులు ఏనాడో వచ్చేశాయి. అయితే.. ఇప్పుడు `ఇక్కడ సినిమా ఫంక్షన్లు చేయడానికి వీల్లేదు` అంటూ మున్సిపల్ అధికారులే రివర్స్‌లో నోటీసులు జారీ చేశారు. దాంతో.. ప్రీ రిలీజ్ వేడుక ప్లేస్, టైమ్ మారబోతోంది. ఈనెల 7న విజయవాడ, లేదంటే గుంటూరులో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించనున్నారు.ముందు అనుమతులు ఇచ్చిన అధికారులే, ఇప్పుడు కుదరదు అనడంలో అర్థమేంటో తెలియడం లేదు.
దీని వెనుక రాజకీయ పరమైన కారణాలేమైనా ఉన్నాయా అనే దిశగా ఫ్యాన్స్ చర్చించుకొంటున్నారు. ఇది వరకు జనతా గ్యారేజ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోనే నిర్వహిద్దామనుకొన్నారు. అయితే అప్పుడు నాన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోర్టుకి వెళ్లి స్టే తెచ్చుకొన్నారు. ఆ స్టే చూపించి.. ఇప్పుడు ఖైదీ నెం.150ని కూడా అడ్డుకోవాలని చూస్తున్నారు. కోర్టు స్టే ఇచ్చిందన్న సంగతి మున్సిపల్ అధికారులకు అనుమతులు మంజూరు చేసినప్పుడు తెలీదా? అప్పుడు అనుమతులు ఇచ్చి, ఇప్పుడు ఎందుకు వెనక్కి తీసుకొన్నారు? అంటూ మెగా ఫ్యాన్స్ లాజిక్కులు తీస్తున్నారు. చిరు కాంగ్రెస్ లీడర్.. అక్కడ అధికారంలో ఉన్నది తెలుగు దేశం ప్రభుత్వం. అందుకే చిరు సినిమాని తొక్కేద్దామనుకొంటున్నారంటూ కొంతమంది మెగా ఫ్యాన్స్ ఈ వివాదానికి రాజకీయ రంగు పులుముతున్నారు. ఏదేమైనా చిరు ప్రీ రిలీజ్ ఫంక్షన్ అర్థాంతరంగా వాయిదా పడింది. మరి నెక్ట్స్ స్టెప్ ఏంటో చూడాలి.
![]() |
![]() |