![]() |
![]() |

ఈనెల 4న విజయవాడలో జరగాల్సిన ఖైదీ నెం.150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈనెల 7న ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చిత్రబృందం ప్రకటించింది. అయితే విజయవాడలో చేస్తారా, లేదంటే హైదరాబాద్‌లోనా? అనే సందేహాలు నెలకొన్నాయి. వీటికి పుల్ స్టాప్ పెడుతూ... ఫంక్షన్ ఎక్కడన్న విషయంలో చిత్రబృందం ఓ క్లారిటీ ఇచ్చేసింది. జనవరి 7న గుంటూరులోని హాయ్‌లాండ్‌లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు అధికారికంగా ప్రకటించేసింది. నిజానికి ఇందిరా ప్రియదర్శినిలో చేయాల్సిన ఈ ఫంక్షన్ వాయిదా పడడంతో.. విజయవాడలోనే మరో చోట నిర్వహించాలని చిత్రబృందం భావించింది.
కానీ... అనుమతులు దొరకడం కష్టం కావడంతో, పైగా చిరు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తారు, వాళ్లందరికీ సౌకర్యాలు కలిగించడం కష్టమవుతుందని భావించడంతో వేడుక గుంటూరుకి ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ప్రీ రిలీజ్ డేట్ మారడంతో.. సినిమా రిలీజ్ డేట్ కూడా ఏమైనా మారుతుందేమో అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అలాంటిదేం లేదని, సంక్రాంతికి చిరు సినిమా విడుదల అవ్వడం ఖాయమని చిత్రబృందం తెలిపింది. సో... చిరు అభిమానులు రిలాక్స్ అయిపోవొచ్చు.
![]() |
![]() |