![]() |
![]() |

ఏ సినిమాకైనా పర్‌ఫెక్ట్ ప్లానింగ్, పబ్లిసిటీ అవసరం. `స్టార్ల సినిమా కదా..` అని లైట్ తీసుకోవడానికి వీల్లేదు. అది సంపూర్ణేష్ బాబు సినిమా అయినా.. మహేష్ బాబు సినిమా అయినా ప్రమోషన్ కావాల్సిందే. అయితే ఈ విషయంలో చిరంజీవి ఇంకా మీనమేశాలు లెక్కేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ సంక్రాంతికి ఖైదీ నెం.150 సినిమా విడుదల కావాల్సివుంది. అయితే ఇప్పటి వరకూ ప్రమోషన్ ఈవెంట్ ఒక్కటి కూడా చేయలేదు. ఓపెనింగ్ గప్ చుప్‌గా చేసేశారు. ఆడియో ఫంక్షన్ ఏదీ జరపకుండానే పాటల్ని విడుదల చేశారు. టీజర్‌కి హడావుడి లేదు. గప్ చుప్‌గా ఆన్‌లైన్ లో పెట్టేశారు.
ఇప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ వాయిదా పడింది. మీడియాకి వదిలిన స్టిల్స్ కొన్ని మాత్రమే. రిలీజ్ పట్టు మని పది రోజులు కూడా లేదు. కనీసం ట్రైలర్‌ని కూడా చూపించలేకపోయింది. రిలీజ్ డేట్ ఇది అని చెప్పలేకపోతోంది. దీన్ని బట్టి మెగా టీట్ ఎంత దారుణమైన వైఫల్యాన్ని మూటగట్టుకొందో అంచనా వేయొచ్చు. కనీసం ట్రైలర్ రిలీజ్ చేసినా బాగుండేది. ట్రైలర్‌ని కూడా దాచి దాచి 7వ తారీఖున ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో చూపిస్తారట. సినిమాని 11న విడుదల చేయాలన్న ప్లాన్ ఉంది. అంటే.. ట్రైలర్‌కీ సినిమా రిలీజ్‌కీ పట్టుమని 4 రోజుల టైమ్ కూడా ఉండదన్నమాట. ఈలోగా ప్రమోషన్లు చేసుకోవాలి. ఇదంతా సాధ్యమా? `నా సినిమాకి ప్రమోషన్లు లేకపోయినా ఫర్వాలేదు` అంటూ చిరు మరీ ఓవర్ కాన్ఫిడెన్స్‌కి పోతున్నాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు బాలయ్య మాత్రం ప్రమోషన్లతో ఊదరగొడుతున్నాడు. ఆడియో ఫంక్షన్ గ్రాండ్ గా నిర్వహించాడు. ట్రైలర్ రిలీజ్‌కీ ఓ వేడుక పెట్టాడు. ఇప్పుడు వరుసగా ఇంటర్వ్యూలు బయటకు వచ్చేస్తున్నాయి. చిరు మాత్రం ఇంకా పాత కాలపు పద్ధతుల్లోనే ఉన్నాడు. సినిమా సంగతేమో గానీ ప్రమోషన్ ప్లానింగ్ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ప్రమోషన్ల విషయంలో చిరు ఎప్పుడు మేల్కొంటాడో ఏంటో??
![]() |
![]() |