![]() |
![]() |

సుమారు తొమ్మిది సంవత్సరాల లాంగ్ గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా ఖైదీ నెంబర్ 150. సంక్రాంతికి రిలీజ్ చేస్తామని దర్శకనిర్మాతలు ముందే ప్రకటించేశారు..అనుకున్న సమయానికి విడుదల చేయడానికి షూటింగ్ పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే మెగాస్టార్ పునరాగమనాన్ని గ్రాండ్‌గా సెలబ్రెట్ చేసేందుకు ఆడియో వేడుకను అత్యంత భారీగా నిర్వహించాలని భావిస్తున్నాడట నిర్మాత రామ్ చరణ్.
ఈ వేడుకకు పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌తో పాటు మెగా హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు హాజరవుతారట. అలాగే వేల సంఖ్యలో మెగా ఫ్యాన్స్‌ను కూడా ఫంక్షన్‌కు ఆహ్వానించాలని డిసైడ్ అయ్యారట. ఈ గ్రాండ్ ఈవెంట్ పూర్తి బాధ్యతలను చెర్రీ తన భార్య ఉపాసనకు అప్పగించాడట. దీంతో ఫంక్షన్‌కు ఎవ్వరిని పిలవాలి..వేదిక ఎక్కడ..నిర్వహణ ఇలా ప్రతి విషయం ఉపాసన కనుసన్నల్లోనే జరుగుతోందట. తనకు తెలియకుండా చీమ కూడా చిటుక్కుమనకూడదని ఉపాసన ఆర్డర్స్ పాస్ చేసిందట.
![]() |
![]() |