![]() |
![]() |

రజనీకాంత్, శంకర్ కాంభినేషన్ అంటే ఆ అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో అందరికి తెలుసు. అందుకు తగ్గట్టుగానే వీరిద్దరి కలయికలో వచ్చిన రోబో ఏ రేంజ్‌లో హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు రోబోకి సీక్వెల్‌గా వస్తున్న 2.0పైనా ఎక్స్‌పెక్టేషన్స్ మామూలుగా లేవు. అయితే 360 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాని అదే స్థాయిలో ప్రమోట్ చేయాలి లేకపోతే..ఆ ఊహా కూడా భరించలేకపోతున్నాం కదా..? బాహుబలికి రాజమౌళి అద్బుతమైన మార్కెటింగ్ స్ట్రాటజీతో ప్రాంతీయ చిత్రాల చరిత్రను తిరగరాసింది. ఇప్పుడు అదే స్ట్రాటజీని కాపీ కొడుతూ..జక్కన్న కంటే కాస్త ఎక్కువగానే ఆలోచిస్తున్నాడు క్రియేటివ్ డైరెక్టర్ శంకర్.
ఈ సినిమాలో హీరో రజనీకాంత్ కాబట్టి ఆయన మార్కెట్ సెపరేట్. విలన్‌గా అక్షయ్ కుమార్ ఉన్నాడు కాబట్టి బాలీవుడ్ జనాలు చూస్తారు. మరి టాలీవుడ్ పరిస్థితి ఎంటీ.? రజనీని తెలుగు వారు బాగానే ఆదరిస్తారు ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే మరింత ఎక్కువగా వసూళ్లు రాబట్టుకోవాలంటే మార్గమేంటి. అందుకే టాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ హీరోతో 2.0లో ఓ స్పెషల్ రోల్ చేయించాలని డిసైడ్ అయ్యాడట శంకర్. మరి, శంకర్ కన్ను ఏ స్టార్ హీరోపై పడిందో, ఆ పాత్రలో ఎవరు కనిపిస్తారో ప్రస్తుతానికి సస్పెన్స్.
![]() |
![]() |